సికింద్రాబాద్‌లో పాన్‌పొర్టు అదాలత్‌

హైదరాబాద్‌:సికింద్రాబాద్‌ జాతీయ పాస్‌పొర్టు కార్యాలయంలో రెండో రోజు పాస్‌పోర్టు అదాలత్‌ జరిగింది.మొదటి రోజు ఈ కార్యక్రమం ఉందనే విషయం తెలియకపోవడంతో దరఖాస్తుదారులు పెద్దగా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోలేదు.అయితే ఈ కార్యక్రమానికి ప్రచారం కల్పించాలని,రెండో రోజు రెండు వేల దరఖాస్తులు తీసుకుంటున్నట్లు పాస్‌పోర్టు అధికారి శ్రీకరన్‌రెడ్డి విలేకరులతో చెప్పారు.ఈ అదాలత్‌ తమకు ఎంతగానో ఉపయోగపడుతుందని దరఖాస్తుదారులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.