*సి పి ఎస్ రద్దు చేస్తూ ఓ పి ఎస్ విధానాన్ని అమలు పరచాలి

ఉపాధ్యాయ సంఘాలు
*గోపాల్ పేట్ జనం సాక్షి సెప్టెంబర్ (01):*. సిపిఎస్ విధానాన్ని రద్దు చేస్తూ ఓ పి ఎస్ విధానాన్ని అమలు పరచాలని రాష్ట్ర ఉపాధ్యాయ సంఘాల పిలుపుమేరకు డిమాండ్ చేస్తూ మండలంలోని యూటీఎఫ్, పి ఆర్ టి యు, ఉపాధ్యాయ సంఘాల ఆదేశాల మేరకు అన్ని గ్రామాలలోని ప్రాథమిక, ప్రాథమిక ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులు గురువారం సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలని నల్ల బ్యాడ్జీలు ధరించి పింఛన్ విద్రోహ దినంగా పాటిస్తూ నిరసన వ్యక్తం చేశారు అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని మండల తాసిల్దార్ కు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ సంఘాల నాయకులు యాదగిరి, హమీద్, పరమేశ్వర చారి, మురళీధర్ రెడ్డి, విజయలక్ష్మి, భీముడు, అర్జున్, మదన్ మోహన్ రాజు, గుణావతి, సంధ్యా, రమేష్, ధర్మరాజు, సరోజ, వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు