సీఎం పర్యటనలో ఉద్రిక్తత
శ్రీకాకుళం: ఆముదాల వలస చక్కెరకర్మాగారాన్ని తెరిపించాలని ముఖ్యమంత్రి కలిసేందుకు ప్రయత్నించిన తెదేపా నేతలను పోలీసులు అదుపులోకి తీసుకొవడంతో ఉద్రిక్తత నెలకొంది. ఈసందర్భంగా పోలీసులు, తెదేపా నేతల మధ్య తోపులాట జరిగింది. జిల్లాలో నెలకొల్పుతున్న ధర్మల్ విధ్యుత్, అణువిద్యుత్ కేంద్రం, కన్నెధార గ్రానైట్ లీజు, ఆముదాలవలస చక్కెర కర్మాగారం తదితర అంశాలతో కూడిన వినతిపత్రం మఖ్యమంత్రికి అందజేయడానికి శ్రీకాకుళం ఎన్జీఓ హోం వద్ద వేచి ఉన్న ఇచ్చాపురం తెదేపా ఎమ్మెల్యే పరియా సాయిరాజు, మాజీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు, మాజీ స్పీకర్ ప్రతిభా బారతీ, మాజీ మంత్రి గుండ అప్పల సూర్య నారాయణ తదితరులను పోలీసులు అడ్డుకున్నారు.