సీఎం సోదరుడి పేరుతో అధికారులకు ఫోన్లు

ఒంగోలు: ముఖ్యమంత్రి సోదరుడి పేరుతో ప్రధానోపాధ్యాయుల బదీలీల కోసం ప్రకాశం జిల్లా కలెక్టర్‌కు, జిల్లా విద్యాశాఖాధికారికి కొందరు గుర్తుతెలియని వ్యక్తులు ఫోన్‌ చేశారు. దీనిపై జిల్లా విద్యాశాఖాధికారి నాగేశ్వరరావు జిల్లా ఎస్సీకి ఫిర్యాదు చేశారు. ఘటనపై కేసునమోదు చేసిన పోలీసులు త్రిపురాంతకం, నగులుప్పలపాడు, చినగంజాం మండలాలకు చెందిన నలుగురు ప్రధానోపాధ్యాయులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.