సెప్టెంబర్‌ 27న సెక్రటేరియట్‌ ముట్టడి

హైదరాబాద్‌: కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో తాడోపేడో తేల్చుకునే విధంగా ఓయూ జేఏసీ తమ భవిష్యత్‌ కార్యాచరణ ప్రకటించింది. తెలంగాణ విద్యార్థి హైదరాబాద్‌ కవాతు పేరుతో సెప్టెంబర్‌ 27న లక్షలాది విద్యార్థులతో సెక్రటేరియట్‌ను ముట్టడించి…తెలంగాణ ప్రకటించకుంటామని ఓయూ జేఏసీ ప్రకటించింది. ఆగస్టు రెండో వారంలో గో టు కాలేజ్‌…సెప్టెంబర్‌ 1నుంచి 17వరకూ గ్రామగ్రామాన విద్యార్థుల పాదయాత్రలు చేపట్టనున్నట్లు వారు తెలిపారు. అడుగడుగునా తెలంగాణ ప్రజాప్రతినిధులు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం పేరుతో తెలంగాణ ప్రజలకు ద్రోహం చేస్తున్నారని ఓయూ ఆవేధణ వ్యక్తం చేసింది. విద్యార్థులు ఉద్యమంతోనే 14ఎఫ్‌, డిసెంబర్‌ 9ప్రకటన సాధించుకున్నామని…అదే తరహాలో సెప్టెంబర్‌ 27న కార్యక్రమాన్ని విజయవంతం చేసి తెలంగాణ సాధించుకుంటామని వారు ధీమా వ్యక్తం చేశారు.