సైబర్ మోసాలపై అవగాహనా కలిగి ఉండాలి. – బెల్లంపల్లి రూరల్ సీఐ రాజ్ కుమార్ గౌడ్.
నెన్నెల, మార్చ్ 11, (జనంసాక్షి )
విద్యార్థులు సైబర్ మోసాలపై అవగాహనా కలిగి ఉండాలని బెల్లంపల్లి రూరల్ సీఐ రాజ్ కుమార్ గౌడ్ అన్నారు. సోమవారం ఆయన నెన్నెల మండల కేంద్రంలోని కేజీబీవీ హై స్కూల్ మరియు కాలేజీలో విద్యార్థులకు సైబర్ నేరాలు, ఉమెన్ సేఫ్టీ, ట్రాఫిక్ రూల్స్ పై ఏర్పాటు చేసిన అవగాహనా కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులపై జరుగుతున్న అఘాయిత్యాలు, వేధింపులు, ఉమెన్ సేఫ్టీ, పోలీస్ మరియు షీ టీమ్స్ ఇంపార్టెంట్స్ పై గురించి అవగాహనా కల్పించారు. తాత్కాలిక ఆనందాల కోసం ప్రలోభాలకు, ఆకర్షణలకు గురై భవిష్యత్తు జీవితం నాశనం చేసుకోవద్దని సూచించారు. విద్యార్థులు విద్యార్థి దశ నుంచే మంచి లక్ష్యాలు అలవర్చుకొని పట్టుదలతో కష్టపడి ఉద్యోగాలు సంపాదించుకోవాలన్నారు. చదువు వలనే సమాజంలో మంచి గుర్తింపు వస్తుందని విద్యార్థులకు సూచించారు. ఆన్లైన్ మోసాలపై అడ్డుకట్ట వేయుటకు తదితర అంశాలపై అవగాహన కల్పిస్తాయని తెలిపారు. ఆండ్రాయిడ్ ఫోన్ ఉపయోగం పెరగడం తో సైబర్ మోసాలు పెరుగుతున్నాయని, మోసగాళ్ల ఉచ్చులో పడి నష్టపోకుండా ఉండాలన్నారు. పరీక్షలు ముగిసిన తరువాత తమ ఇంటికి వెళ్ళాక తల్లిదండ్రులకు, బంధువులకు, చుట్టూ ప్రక్కల వారికి, మీ గ్రామంలలో కూడా సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలని విద్యార్థులకు తెలిపారు. ట్రాఫిక్ రూల్స్ పై, రోడ్ సేఫ్టీ లపై అవగాహనా ఉండాలని, మి తల్లితండ్రులకు హెల్మెట్ తప్పనిసరిగా ఉపయోగించాలని, రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని, వాహనాలకు సంబంధిత పత్రాలన్నీ ఉంచుకోవాలని సూచించాలని తెలిపారు. ఈకార్యక్రమంలో
నెన్నెల రాజశేఖర్, విద్యార్థుల తల్లితండ్రులు, టీచర్లు, విద్యార్థులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.