కామన్వెల్త్‌ హెవీ వెయిట్‌లిఫ్టింగ్‌ కేటగిరీలో సుధీర్‌ బంగారు పతకం కైవ‌సం

పారా వెయిట్‌లిఫ్టర్ సుధీర్‌ తొలిసారి కామన్వెల్త్‌ హెవీ వెయిట్‌లిఫ్టింగ్‌ కేటగిరీలో బంగారు పతకం సాధించాడు. మొదటి ప్రయత్నంలో 208 కేజీలను ఎత్తిన సుధీర్‌.. రెండో ప్రయత్నంలో 212 కేజీలను విజయవంతంగా లిఫ్ట్‌ చేశాడు. మూడో ప్రయత్నంలో 217 కేజీలకు ప్రయత్నించినా సఫలం కాలేదు. అయితే మొత్తం 134.5 పాయింట్లు సాధించిన సుధీర్‌ స్వర్ణపతకం నెగ్గాడు. దీంతో … వివరాలు

2028 ఒలింపిక్స్లో క్రికెట్ను చేర్చే లక్ష్యంగా ఐసీసీ తీవ్రంగా కసరత్తు

2028 ఒలింపిక్స్లో క్రికెట్ను చేర్చే లక్ష్యంగా ఐసీసీ తీవ్రంగా కసరత్తు చేస్తోంది. ఇప్పటికే అనేక సార్లు ఇంటర్నేషనల్ ఒలింపిక్స్ కమిటీకి క్రికెట్ చేర్చాలన్న ప్రతిపాదనను ఐసీసీ పంపింది. ఈ ప్రతిపాదనపై ఐఓసీ తాజాగా స్పందించింది.  ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను ఎందుకు చేర్చాలని భావిస్తున్నారనే దానిపై ప్రెజెంటేషన్‌ ఇవ్వాలని అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ  ఐసీసీని  ఆహ్వానించింది.2028లో లాస్‌ఏంజెలెస్‌ వేదికగా ఒలింపిక్స్‌ … వివరాలు

 అయితే అయ్యర్‌పై వేటు తప్పదా!

వెస్టిండీస్‌తో టీమిండియా రెండో టీ20 నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్‌ ఆకాశ్‌ చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తుది జట్టు ఎంపిక విషయంలో యాజమాన్యానికి చిక్కులు తప్పవని అభిప్రాయపడ్డాడు. ఎవరికి తుది జట్టులో చోటు ఇవ్వాలి.. ఎవరిని తప్పించాలనేది టీమిండియాకు పెద్ద తలనొప్పిగా మారిందని పేర్కొన్నాడు. కాగా ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌లో ఆఖరి రెండు మ్యాచ్‌లలో రిషభ్‌ పంత్‌ … వివరాలు

ప్రపంచ రికార్డు @ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ

వెస్టిండీస్‌తో రెండో టీ20కి ముందు టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మను ఓ ప్రపంచ రికార్డు ఊరిస్తుంది. సెయింట్‌ కిట్స్‌ వేదికగా ఇవాళ (ఆగస్ట్‌ 1) రాత్రి  8 గంటలకు ప్రారంభమయ్యే మ్యాచ్‌లో రోహిత్‌ మరో 57 పరుగులు చేస్తే.. అంతర్జాతీయ టీ20ల్లో 3500 పరుగులు పూర్తి చేసుకున్న తొలి బ్యాటర్‌గా రికార్డుల్లోకెక్కుతాడు. ప్రస్తుతం రోహిత్‌ ఖాతాలో … వివరాలు

నగరంలో పలు చోట్ల భారీ వర్షం

 హైదరాబాద్‌: హైదరాబాద్‌లో ఒక్కసారిగా నగరంలో పలు చోట్ల భారీ వర్షం కురుస్తోంది. రహదారులన్నీ చెరువులను తలపిస్తున్నాయి. ప్రధాన మార్గాల్లో రోడ్లపైకి వరద నీరు చేరడంతో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌ స్తంభించింది. వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి.బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, పంజగుట్ట, అమీర్‌పేట్‌, మాదాపూర్‌, జీడిమెట్ల, లింగంపల్లి, గచ్చిబౌలి, కూకట్‌పల్లి, మారేపల్లి, కంటోన్మెంట్‌ ప్రాంతాల్లో వాన దంచికొడుతోంది. అదే … వివరాలు

అచింత షూలి బంగారు పతకం సొంతం

బర్మింగ్‌హామ్‌: కామన్వెల్త్‌ గేమ్స్‌లో భారత వెయిట్‌ లిఫ్టర్ల జోరు కొనసాగుతున్నది. వెయిట్‌ లిఫ్టర్లు మరో స్వర్ణాన్ని భారత్‌ ఖాతాలో వేశారు. పురుషుల 73 కేజీల విభాగంలో 20 ఏండ్ల అచింత షూలి (Achinta Sheuli) బంగారు పతకం సొంతం చేసుకున్నాడు. దీంతో భారత్‌ పతకాల సంఖ్య ఆరుకు చేరింది. స్నాచ్‌ తొలి ప్రయత్నంలోనే 137 కేజీల … వివరాలు

మార్టిన్‌ గప్టిల్‌ టి20 క్రికెట్‌ కొత్త చరిత్ర

న్యూజిలాండ్‌ సీనియర్‌ ఆటగాడు మార్టిన్‌ గప్టిల్‌ టి20 క్రికెట్‌ కొత్త చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ టి20 క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మను అధిగమించి అగ్రస్థానానికి చేరుకున్నాడు. బుధవారం స్కాట్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో గప్టిల్‌ 31 బంతుల్లో 40 పరుగులు చేశాడు. ఈ క్రమంలో రోహిత్‌ శర్మ(3379 పరుగులు) రికార్డును … వివరాలు

రెండు వికెట్లు తీసి విండీస్‌కు భారీ జ‌ల‌క్

వెస్టిండీస్‌తో జ‌రిగిన మూడ‌వ వ‌న్డేలో స్పీడ్ బౌల‌ర్ సిరాజ్ నిప్పులు చెరిగాడు. విండీస్ బ్యాట‌ర్ల‌ను వెంట వెంట‌నే ఔట్ చేశాడు. రెండ‌వ ఓవ‌ర్‌లో కైల్ మేయ‌ర్స్‌, షామ‌ర్ బ్రూక్స్ వికెట్ల‌ను తీశాడు. మూడు బంతుల వ్య‌వ‌ధిలోనే రెండు వికెట్లు తీసి విండీస్‌కు భారీ జ‌ల‌క్ ఇచ్చాడు. మూడ‌వ వ‌న్డేలో ఇండియా డ‌క్‌వ‌ర్త్ లూయిస్ ప‌ద్ధ‌తి ప్ర‌కారం … వివరాలు

శుబ్‌మన్‌ గిల్‌ విషయంలో ఆర్‌సీబీ తప్పుడు ట్వీట్‌

టీమిండియా యువ ఆటగాడు శుబ్‌మన్‌ గిల్‌ విషయంలో ఆర్‌సీబీ తప్పుడు ట్వీట్‌ చేయడం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. బుధవారం వెస్టిండీస్‌తో జరిగిన మూడో వన్డేలో శుబ్‌మన్‌ గిల్‌ 98 బంతులెదుర్కొని వంద స్ట్రైక్‌రేట్‌తో 7 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 98 పరుగులు నాటౌట్‌గా నిలిచాడు. వర్షం అంతరాయం గిల్‌ను సెంచరీ చేయకుండా ఆపేసింది. … వివరాలు

ఆధిపత్యం చాటుకున్న జుకోవిచ్‌

వింబుల్డన్‌ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలో ఎనిమిదోసారి ఫైనల్లోకి నేడు ఫైనల్‌లో తలపడనున్న స్టార్‌ లండన్‌,జూలై9 ( జనంసాక్షి):   మరోసారి తన ఆధిపత్యాన్ని చాటుకుంటూ సెర్బియా టెన్నిస్‌ స్టార్‌, డిఫెండిరగ్‌ చాంపియన్‌ నొవాక్‌ జొకోవిచ్‌ వింబుల్డన్‌ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలో ఎనిమిదోసారి ఫైనల్లోకి ప్రవేశించాడు. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్‌ రెండో సెవిూఫైనల్లో టాప్‌ సీడ్‌ జొకోవిచ్‌ 2 గంటల 34 … వివరాలు