హుజూర్ నగర్ మార్కెట్ యార్డ్ ను పరిశీలించిన ఎమ్మెల్యే
హుజూర్ నగర్ మార్చి 24 (జనంసాక్షి): నేడు జరగనున్న హుజూర్ నగర్ నూతన మార్కెట్ చైర్మన్ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి సభా స్థలి ఏర్పాట్లను ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి శుక్రవారం పరిశీలించడం జరిగింది. అనంతరం అధికారులకు, నాయకులకు ఎమ్మెల్యే తగు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ దొంతగాని శ్రీనివాస్ గౌడ్, జడ్పిటిసి కొప్పుల సైదిరెడ్డి, బీఆర్ఎస్ పట్టణ పార్టీ అధ్యక్షులు చిట్యాల అమర్నాథ్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి అమర్ గౌడ్, ముడెం గోపిరెడ్డి, సోమగాని ప్రదీప్, రామకృష్ణ, డిఎస్పీ వెంకటేశ్వర్ రెడ్డి, సిఐ రామలింగారెడ్డి, ఎస్ఐ వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.