హైదరాబాద్‌:పట్టిసీమ ప్రాజెక్టును ఏడాదిలోగా పూర్తి చేస్తాం : మంత్రి దేవినేని

హైదరాబాద్‌, మార్చి18 : రాయలసీమ నీటి అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఏడాదిలోగా పట్టిసీమ ప్రాజెక్టును పూర్తిచేస్తామని రాష్ట్ర మంత్రి దేవినేని ఉమా చెప్పారు. నదుల అనుసంధానంపై జరిగిన చర్చకు మంత్రి సమాధానమిస్తూ రాయలసీమకు పట్టిసీమ ఎంతో అవసరమన్నారు. పోలవరం కుడికాల్వ నుంచి రాయలసీమకు నీరిస్తామని మంత్రి ప్రకటించారు. ఏడాది లోగగా పనులు పూర్తిచేయాలన్న ఒప్పందంతోనే పట్టిసీమ టెండర్లు ఖరారు చేశామని తమకు నీళ్లమీదనే ధ్యాస తప్ప కమీషన్లమీద లేదని దేవినేని స్పష్టం చేశారు. దీనిపై వైసీపీ సభ్యులు నినాదాలు చేస్తూ సభకు ఆటంకం కలిగించారు. దీనిపై సభా నాయకుడైన ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడేందుకు లేవగా దాన్ని వైసీపీ సభ్యులు అడ్డుకున్నారు.