హోంగార్డ్ కుటుంబానికి ఆర్థిక చేయూత
పాన్ గల్ సెప్టెంబర్ 03( జనం సాక్షి )
మండల కేంద్రానికి చెందిన హోంగార్డ్ విష్ణు కుటుంబానికి శనివారం రోజు పూర్వ విద్యార్థులు ఆర్థిక సాయం చేశారు. ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన హోంగార్డ్ విష్ణు కి 1999 ఎస్ఎస్సి బ్యాచ్ పూర్వ విద్యార్థులు సేకరించిన 45 వేల రూపాయలను విష్ణు కుటుంబ సభ్యులకు అందజేసి,విష్ణు చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.