అంగన్వాడీ టీచర్ పద్మ పార్థివ దేహానికి ఘననివాలి

నాగర్ కర్నూల్ రూరల్ అక్టోబర్ 17(జనంసాక్షి)

ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనారిటీ రాష్ట్ర అధ్యక్షుడు జెట్టి.ధర్మరాజు…

 

నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో సంత బజార్లో నివసిస్తున్న పోతురాజుల.పద్మమ్మ అంగన్వాడీ టీచరుగా గత 36 సంవత్సరాల నుంచి 75రూపాయల నుండి జీవనం కొనసాగిస్తూ,అలాగే తన వృత్తి అయిన బేకరీ తనాన్ని కూడా కులమత బేధాలు లేకుండా ఎలాంటి శవాలనైనా తీసుకువెళ్లి స్మశాన వాటికలో సమాధి చేసేవారు.ఏ రోజు ఈమె నేనొక ఎంప్లాయిని కదా అని ఎగసిపడిన వ్యక్తి కాదు.ప్రతి ఒక్కరి దృష్టిలో చేదోడువాదోడుగా ఉన్న వ్యక్తి తన జాబ్ కు తను న్యాయం చేసేవారు.కొన్ని రోజుల క్రిందట అంగన్వాడి ట్రైనింగ్ ఉందని పిడి టైనింగ్ కీ పోవలని ఆదేశాల జరి చేయడం జరిగింది.పద్మ మాటలు నా ఆరోగ్యం బాగాలేదు అని చెప్పిన.ఈ మాటలు లేవి పట్టించుకోకుండా పిడి ఆమెపై ఎలాంటి సామభూతి చూపకుండా ట్రైనింగ్ కు పంపించడం జరిగింది.అక్కడే ఆమె అక్కడికి వెళ్లిన తర్వాత ఆ వాతావరణం పడక పద్మ తీవ్ర అనారోగ్యానికి గురి కావడం జరిగింది.ఈ విషయం తెలుసుకున్న తన కుమారుడు కిరణ్ మహబూబ్ నగర్ లో ఉన్న ప్రైవేట్ హాస్పిటల్ కి 15వ తేదిన తీసుకెళ్లగా చికిత్స పొందుతూ నిన్న రాత్రి సుమారు 11గంటల ప్రాంతంలో మరణించడం జరిగింది.ఇట్టి విషయం తెలుసుకున్న ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనార్టీ పోరాట రాష్ట్ర అధ్యక్షులు జెట్టి.ధర్మరాజు ఏం జరిగిందని పద్మ కుమారుడు అడిగారు తన కుమారుడు తన తల్లికి అన్యాయం జరిగిందో అతనితో చెప్పుకున్నారు.రాష్ట్ర అధ్యక్షులు జెట్టి.ధర్మరాజు అంగన్వాడి పిడి నీ ప్రశ్నించగా ఆమె నిర్లక్ష్యంగా సమాధానాలు ఇవ్వడం జరుగుతుంది ఇట్టి విషయాన్ని పిడి ని వెంబడి పెట్టుకుని జిల్లా కలెక్టర్ దగ్గరికి తీసుకెళ్లి అక్కడ నిలదీయడం జరిగింది.విషయం తెలుసుకున్న కలెక్టర్,పద్మ కుటుంబానికి తన కుమారునికి ఉద్యోగం కలిగిస్తానని ఆర్థిక సహాయం చేయడం జరిగింది.తర్వాత రాష్ట్ర అధ్యక్షులు జెట్టి.ధర్మరాజు స్థానిక ఎమ్మెల్యే మర్రి.జనార్దన్ రెడ్డి దృష్టికి కూడా తీసుకువెళ్లారు ఎమ్మెల్యే మునుగోడు ఎలక్షన్ లో ఉన్నందున నేను రాలేకపోతున్నానని ఆయన కన్నీరు మున్నీరు చేశారు.బాధ్యత కుటుంబానికి అన్ని విధాలుగా నేను న్యాయం చేస్తానని ఫోన్లో ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనార్టీ పోరాట రాష్ట్ర అధ్యక్షులు జెట్టి.ధర్మరాజు తెలిపారు.