అంగన్వాడీ లో సీమంతం – చిరుధాన్యాలపై అవగాహన

అశ్వారావుపేట, మార్చి 29(జనంసాక్షి )
మండలంలోని తిరుమల కుంట అంగన్వాడి -1 సెంటర్లో ఐసిడిఎస్ ఆధ్వర్యంలో సీమంతం నిర్వహించారు. జాతీయ పోషణ పక్షోత్సవాల లో భాగంగా సీమంత కార్యక్రమం నిర్వహించి గర్భవతులకు పూలు పండ్లు గాజులు సమర్పించి అక్షింతలతో దీవించారు. అనంతరం చిరుధాన్యాల వంటకాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ స్వరాజ్యం, అంగన్వాడి టీచర్లు వాణి, సత్యవతి, శ్రీనివాసమ్మ, తల్లులు, పిల్లలు ఆయా తదితరులు పాల్గొన్నారు.