అంగన్ వాడి కేంద్రంలో పోషకాహార మిల్లెట్ పండుగ
వేములవాడ సెప్టెంబర్ 10 (జనంసాక్షి)వేములవాడ మున్సిపాలిటీ పరిదిలోని 3 వ వార్డు అయ్యోరుపల్లి లోని అంగన్ వాడి కేంద్రంలో శనివారం రోజున పోషకాహార మిల్లెట్ ఫుడ్ పండగ నిర్వహించారు, అనంతరం వారు మాట్లాడుతూ పిల్లలు పోషకాహార లోపంతో ఉండకూడదని ఉద్దేశం తో చిరు దాన్యాలతో తయారు చేసిన పౌష్టికాహారన్నీ పిల్లలకు ప్రతి రోజు అందిస్తమని అన్నారు ముందుగా రాగులతో చేసిన లడ్డులను పిల్లలకు తినిపించారు,ఈకార్యక్రమంలో అంగన్ వాడి టీచర్ బుజ్జమ్మ,మాజీ సర్పంచ్ లు ఉల్లేందుల అంజయ్య,వడిజె మల్లయ్య,మాజీ వార్డుమెంబెర్ ఉల్లేందుల రాజు,ఆశావర్కర్ రేణుక,అంగన్ వాడి ఆయ అంజమ్మ,పిల్లల తల్లులు తదితరులు ఉన్నారు.