అంగరంగ వైభవంగా దుర్గాదేవి ఊరేగింపు

ఊరేగింపులో జడ్పీ చైర్మన్ యువకులతో డ్యాన్స్

టేకులపల్లి, అక్టోబర్ 7 (జనం సాక్షి): టేకులపల్లి మండల కేంద్రంలోని శ్రీ కోదండ రామాలయం లో ఏర్పాటు చేసిన దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా చివరి రోజు అయిన శుక్రవారం భారీ ఊరేగింపు నిర్వహించారు. దుర్గాదేవి నవరాత్రి రోజు న అవతార దర్శన పట్టు వస్త్రాల వేలంపాటలో భక్తులు పాల్గొని పది రోజుల పట్టు వస్త్రాలను వేలంలో పదిమంది భక్తులు దక్కించుకున్నారు. అదేవిధంగా అమ్మవారి మహా కలశం ,చిన్న కలిశాలు రెండు కూడా వేలంపాటలో ముగ్గురు భక్తులు దక్కించుకున్నారు. వేలంపాటలో దక్కించుకున్న పట్టు వస్త్రాలను, కలిశాలను ఊరేగింపుగా బయలుదేరి వారి గృహాలలో అందజేశారు. దుర్గాదేవి అమ్మవారి ఊరేగింపులో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిషత్ చైర్మన్ కోరం కనకయ్య యువకులతో కలిసి నృత్యాలు చేశారు. అనంతరం నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ నిర్వాహకులు గోల్యా తండా గ్రామపంచాయతీ సర్పంచ్ బోడ నిరోషా మంగీలాల్ నాయక్, గుడిపూడి మోహన్ రావు ,గుడిపూడి సత్యనారాయణ, టేకులపల్లి సర్పంచ్ బోడ సరిత తదితరులు పాల్గొన్నారు.