అంటూ వ్యాధులు ప్రబలకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి- కార్పోరేటర్ తోకల శ్రీనివాస్ రెడ్డి.
*అంటూ వ్యాధులు ప్రబలకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి- కార్పోరేటర్ తోకల శ్రీనివాస్ రెడ్డి*
*రాజేంద్రనగర్. ఆర్.సి (జనం సాక్షి) : అంటూ వ్యాధులు ప్రబల కుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని మైలార్దేవుపల్లి కార్పొరేటర్ తోకల శ్రీనివాస్ రెడ్డి అన్నారు.
బుధవారం రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ సర్కిల్ మైలార్దేవుపల్లి డివిజన్లోని బిజెపి పార్టీ కార్యాలయంలో జిహెచ్ఎంసి శానిటేషన్ సిబ్బందికి డస్ట్ బిన్లను అందజేసిన కార్పొరేటర్ తోకల శ్రీనివాసరెడ్డి.
ఈ సందర్భంగా మాట్లాడుతూ డివిజన్లో పారిశుద్ధ్యానికి అధిక ప్రాధాన్యతమిస్తూ కాలనీలను పరిశుభ్రంగా ఉంచాలన్నారు. వ్యాపారస్తులు కాలనీవాసులు కూడా పారిశుద్ధ కార్మికులకు సహకరిస్తూ చెత్త ఎక్కడపడితే అక్కడ వేయకుండా డస్ట్ బిన్లలో వేసి పారిశుద్ధ కార్మికులు తీసుకువచ్చిన ఆటోలోనే వెయ్యాలన్నారు. కాలనీలో ఉన్న చెత్తను రోజువారీగా జిహెచ్ఎంసి అధికారులు సమన్వయంతో పనిచేసి తీసివేయాలన్నారు. వర్షాకాలం కావడంతో అంటు వ్యాధులు ప్రజలే అవకాశం ఉందని అంటూ వ్యాధులు ప్రబలకుండా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని జిహెచ్ఎంసి అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసి సానిటేషన్ సిబ్బంది, పారిశుద్ధ కార్మికులు తదితరులు పాల్గొన్నారు.
ఫోటో రైటప్ : శానిటేషన్ సిబ్బందికి డస్ట్ బిన్లు పంపిణీ చేస్తున్న కార్పొరేటర్ తోకల శ్రీనివాస్ రెడ్డి.
Attachments area