అండర్‌ పాస్‌ మూసేయడంపై సిపిఐ ఆందోళన

మహబూబాబాద్‌,జూన్‌7(జ‌నం సాక్షి): జిల్లా కేంద్రంలో సీపీఐ 3 రోజుల రిలే దీక్షలు కొనసాగాయి. దీక్షలోకూర్చున్న సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి బీ అజయ్‌ సారధి మాట్లాడుతూ జిల్లాకేంద్రంలోని ఆర్యుబీ(రైల్వే ఓవర్‌ బ్రిడ్జి) బీటలువారి ప్రమాదకరమైన పరిస్థితిలో మూసివేయడంతో ప్రయాణికులు, వాహనదారులు తీవ్రఇబ్బందులు గురిఅవుతున్నారని అన్నారు. అధికారులు ప్రత్నామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడంతో తీవ్ర ట్రాఫిక్‌ ఇబ్బందులతో ఆక్సిడెంట్‌ లు అవుతున్నాయన్నారు. ఇది వాహనదారుల ప్రాణాలకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని అన్నారు. సమస్యను పరిష్కరించే వరకూ తమ సీపీఐ పోరాటం ఆగదని అన్నారు. వెంటనే రైల్వే ఉన్నతాధికారులైనా స్పందించి పాత కురవిగేట్‌ ను తెరిపించి సమస్యను పరిష్కరించాలని అన్నారు. కార్యక్రమంలో పట్టణ కార్యదర్శి పెరుగు కుమార్‌,సహాయ కార్యదర్శి రేషపల్లి నవీన్‌,మామిండ్ల సాంబలక్ష్మి,నర్రా శ్రవణ్‌,చింతకుంట్ల ఏకాంబ్రం తదితరులు పాల్గొన్నారు.