అందరికీ విద్య అందరి బాధ్యత

వరంగల్‌,మార్చి3(జ‌నంసాక్షి):  అందరికీ విద్య అందరి బాధ్యతగా సంపూర్ణ అక్షరాస్యత సాధించాలని ఎంపీపీ కె.సుశీల అన్నారు. ఆమె మంగళవారం మండల పరిషత్‌ కార్యాలయంలో ఐదో దశ అక్షరాస్యత కార్యక్రమాలపై గ్రామ సాక్షరభారత్‌ కో ఆర్డినేటర్లతో ఏర్పాటు చేసిన శిక్షణ శిబిరంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో భాస్కర్‌, సాక్షరభారత్‌ మండల కో ఆర్డినేటర్‌ తిరుపతి, రిసోర్స్‌పర్సన్‌ నర్సింహులు తదితరులు పాల్గొన్నారు. ఇదిలావుంటే ఖానాపురంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మంగళవారం స్వయంపరిపాలనా దినోత్సవాన్ని నిర్వహించారు. విద్యార్థులు ఉపాధ్యాయులుగా మారి పాఠాలు బోధించారు. డీఈవోగా ప్రియాంక, ప్రధానోపాధ్యాయురాలిగా సనాఫ్రీన్‌, 22 మంది విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం జరిగిన సమావేశంలో ఎస్‌ఎంసీ లద్ఘిర్మన్‌ అన్వర్‌ పాషా, ప్రధానోపాధ్యాయురాలు సరళ పాల్గొన్నారు.