అంబేడ్కర్ ఆశయ సాధనకు కృషి
తెలంగాణలో ఎస్సీఎస్టీ సంక్షేమంలో ముందున్నాం: కడియం
జనగామ,మే28( జనం సాక్షి ): అంబేద్కర్ ఆశయ సాధనకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారని, బడుగు బలహీన వర్గాలు ఆర్థికంగా ఎదగడానికి పలు రకాల సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేస్తున్నారని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. జిల్లా లోని వెంకీర్యాల గ్రామంలో రాజ్యాంగ నిర్మాత డా.బీఆర్ అంబేద్కర్ విగ్రహన్ని ప్రారంబించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ వెంకటేశ్వర్లు, ఎంపీ బూర నర్సయ్య గౌడ్, రాజ్యసభ సభ్యుడు బండ ప్రకాష్, జడ్పీ ఛైర్మన్ పద్మ, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి తదితరుల పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్య అతిధిగా హాజరైన ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి మాట్లాడుతూ….డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగంలో ఆర్టికల్ 3 ని పొందుపరచడం కారణంగానే తెలంగాణ రాష్ట్రం సిద్దించిందని అన్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో వెనుకపడిన ఎస్సి, ఎస్టీ కులాల వారికి ఉన్నత విద్యను అందించి ఉపాధి అవకాశాలు కల్పించాలనే సంకల్పంతో రాష్ట్రంలో నూతనంగా 550 గురుకుల ఆశ్రమ పాఠశాలను ఏర్పాటు చేశామన్నారు. రైతు సంక్షేమం కోసం రైతు బంధు పథకం ద్వారా ఎకరాకు రూపాయలు 4000 అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని తెలిపారు. అంతటి ఆగక రైతు బీమా పథకం కింద ప్రమాదవశాత్తు రైతు మరణిస్తే రైతు కుటుంబాలకు రూపాయలు 5 లక్షల విలువ కల బీమా కల్పిస్తుందని అన్నారు. గ్రామ అభివృద్ధి కోసం మహిళా సంఘం భవనం, ఎస్సి కమ్యూనిటీ భవనం, పాల భవనం,ముదిరాజ్ భవన నిర్మాణానికి రూపాయలు 31 లక్షలు ఎంపీ, జెడ్పి, ఎమ్మెల్సీ నిధుల నుండి విడుదల చేస్తామని హావిూ ఇచ్చారు.