అంబేద్కర్ మెమోరియల్ లో శవపేటికలు

డోర్నకల్ సెప్టెంబర్ 6 జనం సాక్షి

రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జ్ఞాపకార్ధంగా అంబేద్కర్ మెమోరియల్ అసోసియేషన్ పేరిట నిర్మించిన భవనాన్ని ఆశాయానికి విర్దుద్దంగా వస్తువుల వినియోగం జరుగుతుంది.అంబేద్కర్ భవనంతో విజ్ఞానం పెంచాల్సి పుస్తకాలు,చదువ చేప్పే ట్యాటర్లను ఏర్పాటు చేయాల్సి ఉండగా అందుకు భిన్నంగా శవాల పెట్టెలను నిల్వ ఉంచడం పట్ల అంబేద్కర్ వాదులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.పురపాలక పరిధి అంబేద్కర్ నగర్ లో గార్ల-డోర్నకల్ ప్రధాన రహదారిలో అంబేద్కర్ విగ్రహాం,ఆ పక్కనే అంబేద్కర్ మెమోరియల్ సొసైటీ ఆధ్వర్యంలో ప్రజలచే నిర్మితమైన భవనం అందులో ఆయన ఆశయాలకు అనుగుణంగా యువతకు జ్ఞానాన్ని పెంపొందించాలి.అందుకు భిన్నంగా ఓ వ్యక్తి గత కొంతకాలంగా శవాల ఫ్రీజర్ బాక్స్లు (శవాల పెట్టెలు) ఇతర వస్తువులను నిల్వ చేస్తున్నాడని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.ఇప్పటికైనా స్థానిక ప్రజా ప్రతినిధులు చొరవ తీసుకొని అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా భవనాన్ని ఉపయోగంలోకి తీసుకురావాలని అంబేద్కర్ వాదులు కోరుతున్నారు