అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ
జనం సాక్షి, వంగూర్:
మండల పరిధిలోని కోనేటిపురం గ్రామంలో శనివారం భారతదేశ మొదటి న్యాయశాఖ మంత్రి, రచన కమిటీ అధ్యక్షులు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరణ కార్యక్రమం జరిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, సతీష్ మాదిగ, కొయ్యల శ్రీనివాసులు పాల్గొని అంబేద్కర్ విగ్రహాన్ని పూలమాలతో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అంబేద్కర్ అందించిన రాజ్యాంగం వల్ల, అట్టడుగు వర్గాలకు చెందిన వర్గాలకు స్వేచ్ఛ లభించిందని అన్నారు. అంబేద్కర్ చెప్పిన మాటల్లో ప్రజాసేవ లక్ష్యంగా సాగుతున్నట్లు తెలిపారు. అనంతరం గ్రామంలో సిసి కెమెరాలు ప్రారంభించారు. బతుకమ్మ చీరల పంపిణీ చేశారు. సాయంత్రం ఆరు గంటలకు మండల కేంద్రంలో రైతు వేదిక లో ఆసరా పెన్షన్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం సభ్యులు, గ్రామ సర్పంచ్ కరుణమ్మ, టిఆర్ఎస్ వంగూరు మండల మాజీ అధ్యక్షులు కోట్ల నరేందర్ రావు, విగ్రహ దాత గొట్టిముక్కల హనుమంతరావు, యాదవ సంఘం అధ్యక్షుడు లాలు యాదవ్, జిల్లా కో ఆప్షన్ మెంబర్ హమీద్, సింగిల్ విండో చైర్మన్ సురేందర్ రెడ్డి, మండల ప్రెసిడెంట్ పులిజాల కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Attachments area