అకాల వర్షాల వల్ల పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి

రాష్ట్ర సర్పంచుల ఐక్యవేదిక అధ్యక్షుడు కొన్నింటి సురేష్
మోమిన్ పేట ఆగస్టు 8 జనం సాక్షి
అకాల వర్షాల వల్ల పంట నష్టపోయిన రైతులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకొని ఎకరాకు  2 లక్షల రూపాయలు
పంట నష్టపరిహారం అందించాలని రాష్ట్ర సర్పంచులు ఐక్యవేదిక అధ్యక్షుడు కొన్నింటి సురేష్ ప్రభుత్వాన్ని సూచించారు సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ అతివృష్టి అనావృష్టి కారణంగా వ్యవసాయ రైతులు పంటలన్నీ నష్టం వాటిల్లిందని ప్రతి రైతుకు ఎకరాకు 25 నుంచి 50 వేల వరకు పెట్టుబడి ఖర్చు అయ్యిందని వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించి ఎకరాకు రెండు లక్షల రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని ఆయన సూచించారు అదేవిధంగా ఎరువులు విత్తనాలు ఉచితంగా సరఫరా చేసి రైతులను ఆదుకోవాలని ఆయన కోరారు కూరగాయ పంటలు రైతులకు ఉద్యానవన శాఖ నుండి వ్యవసాయ శాఖ నుండి రెవెన్యూ శాఖ నుండి గ్రామస్థాయిలో విచారణ పంట నష్టం వివరాలు సేకరించి వెంటనే రైతులకు నష్టపరిహారం అందించాలని ఆయన సూచించారు