అక్రమార్కులపై చర్యలెందుకు తీసుకోలేదు?
హైదరాబాద్:ప్రజాపద్దుల సంఘం ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో అలసత్వం వహిస్తున్న,అక్రమాలకు పాల్పడుతున్న అధికారులపై ప్రభుత్వం చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ప్రజాపద్దుల సంఘం ప్రశ్నించింది.శాసనసభ కమిటీ óహలులో ఛైర్మన్ రేవూరి ప్రకాశ్‌రెడ్డి అధ్యక్షతన సమావేశమైన పీఏసీ కల్వకుర్తి ఎత్తిపొతల,పులిచింతల ప్రాజెక్టులను సమీక్షించింది.కల్వకుర్తి ప్రాజెక్టు నిర్మాణ వ్యయమైన 2788 కోట్లలో ఎనభై శాతం చెల్లింపులు పూర్తయినప్పటికీ ఇంకా నీరివ్వలేదని సభ్యులు ఆక్షేపించారు.ప్రాజెక్టులో భాగమైన సర్జికల్ ప్లాంట్ కుప్పకూలినా చర్యలు తీసుకోకుండా మళ్లీ చెల్లింపులు ఎందుకు చేశారని ప్రశ్నించారు.గుత్తేదార్లతో అదికారులు కుమ్మక్కయ్యారని,తొమ్మిదిమంది అదికారులపై చర్యలు తీసుకోవాలని విజిలెన్స్ సిఫారసు చేసినప్పటీకీ ఇంకా ఎందుకు తీసుకోలేదని సభ్యులు నిలదీశారు.సంబందించిన సమగ్ర నివేదికను రేపటిలోగా అందించాలని కమిటీ ఆదేశించింది.అటు పులిచింతలోనూ అక్రమార్కులపై చర్యలు తీసుకోవడంలో ఎందుకు మీనమేషాలు లెక్కిస్తున్నారని ప్రశ్నించారు.