అక్రమ అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరు.
గిరిజన రిజర్వేషన్ సాధించి తీరుతాం.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి గిరిజన సంఘాల హెచ్చరిక.
తాండూరు సెప్టెంబర్ 29(జనంసాక్షి)అక్రమ అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరని ఎన్ని అడ్డంకులు ఎదురైన గిరిజన రిజర్వేషన్
సాధించి తీరుతాంమని గిరిజన సంఘాల నాయకులు (యల్ హెచ్ పి యస్ , గోర్ బంజారావెల్ఫేర్ అసోసియేషన్, ఏ ఐ టీ ఎఫ్ ,) నాయకులు రాంజీ రాథోడ్ ,ప్రకాష్ రాథోడ్ ,బానోత్ అరుణ్ నాయక్ ,భానుపవర్ ,రమేష్ నాయక్ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ప్రగతి భవన్ ముట్టడి కార్యక్రమంలో భాగంగా పోలీసులు వారిని ముందస్తు అరెస్టు చేశారు .ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల హామీమేరకు కెసిఆర్ ప్రభుత్వం గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్ కల్పించి హామీని నిలబెట్టు కోవాలని కోరారు.గత 8 సంవత్సరాలుగా గిరిజనులువిద్య, ఉద్యోగ,రాజకీయంగా,తీవ్ర అన్యాయానికి మరియు వివక్చకు గురయ్యారని ఆవేదన వ్యక్తంచేశారు .మొన్న ప్రకటించిన ఉద్యోగ నోటిఫికేషన్ రద్దు చేసి గిరిజన రిజర్వేషన్ కల్పించి కొత్త ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అదేవిధంగా పెరిగిన జనాభా అనుగు ణంగా ఆయ రాష్ట్ర ప్రభుత్వాలు రాజ్యాంగంలో ని ఆర్టికల్ 16(4)ఎ ద్వారా రిజర్వేషన్ పెంచుకో వచ్చని దీనికి కేంద్ర ప్రభుత్వఅనుమతి అవసరం లేదని ఎక్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా జీ ఓ విడుదల చేసి రిజర్వేషన్ కల్పించాలనికోరారు.రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్ ప్రకటన చేయకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.