అక్రమ కట్టడాలపై హైకోర్టు

హైదరాబాద్‌, జనంసాక్షి:హిమాయత్‌సాగర్‌, ఉస్మాన్‌సాగర్‌లలో అక్రమకట్టడాలపై హైకోర్టు దృష్టి సారించింది. ఈమేరకు అక్రమ నిర్మాణాలను తొలగించాలంటూ దాఖలైన పిటిషన్‌ విచారణ జరిపింది. ఉస్మాన్‌సాగర్‌, హిమాయత్‌సాగర్‌ పరిసరాల్లో అక్రమంగా నిర్మించిన కట్టడాలను ఎందుకు తొలంగించలేదంటూ కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. వీటిని తొలగిగించాలంటూ కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది వీటిని తొలగించేందుకు టాస్క్‌ఫోర్స్‌ను ఎందుకు ఏర్పాటు చేయలేదని ధర్మాసనం ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. తదుపరి విచారణను వచ్చే గురువారానికి వాయిదా వేసింది.