అఖిలపక్షంలో ప్రత్యేక రాయలసీమ వాణి వినిపించాలి: బైరెడ్డి

హైదరాబాద్‌: ఈనెల 28న జరిగే అఖిల పక్ష సమావేశంలో ప్రత్యేక రాయలసీమ అంశాన్ని వినిపించాలని బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి తెదేపా  కార్యాలయంలో ఎన్టీఆర్‌ విగ్రహం వద్ద వినతి పత్రం ఉంచారు. తెలంగాణ ఆంశంతో పాటు రాయలసీమ ప్రజల మనోభావాలను ఢిల్లీ పెద్దలకు అన్ని రాజకీయ పార్టీలకు తెలపాలని ఆయన డిమాండ్‌ వ్యక్తం చేశారు. ఇదే విషయమై కాంగ్రెస్‌ తెదేపాతో పాటు అన్ని పార్టీలకు లేఖలు అందిస్తున్నట్లు బైరెడ్డి చెప్పారు.