అఖిలపక్షానికి టీఆర్‌ఎస్‌ నుంచి కేసీఆర్‌, నాయిని నర్సింహరెడ్డి

హైదరాబాద్‌: అఖిలపక్ష  సమావేశానికి టీఆర్‌ఎస్‌ తరపున వెళ్లే ప్రతినిధులు ఎవరో తేలిపోయింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై పార్టీలు తమ అభిప్రాయాలు చెప్పేందుకు డిసెంబర్‌ 28న కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశానికి టీఆక్‌ఎస్‌ నుంచి వెళ్లే ప్రతినిధులను ఆ పార్టీ ఖరారు చేసింది. టీఆర్‌ఎస్‌ నుంచి అఖిలపక్ష సమావేశానికి టీఆర్‌ఎస్‌ అధినేత, గులాబీ దళపతి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుతోపాటు ఆపార్టీ పొలిట్‌ బ్యూరో నాయిని నర్సింహరెడ్డిలు వెళ్లనున్నారు. అఖిలపక్ష  సమావేశానికి తనతోపాటు నాయిని ఢిల్లీ రానున్నట్టు కేసీఆర్‌ ప్రకటించారు.