అగ్నిప్రమాదంలో 35 ద్విచక్రవాహనాలు దగ్ధం
హైదరాబాద్ : నగరంలోని లిబర్టీ చౌరస్తాలో ఓ విద్యుత్తు ట్రాన్స్‌ఫార్మర్ పేలి మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో పైగా ప్లాజా ముందు ఉన్న విద్యుత్తు ట్రాన్స్‌ఫార్మర్ సహా పక్కనే ఉన్న 35 ద్విచక్రవాహనాలు దగ్ధమయ్యాయి. వ్యాపార సముదాయాల బోర్డులు సైతం అగ్నికి ఆహుతయ్యాయి. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని మంటలు ఆర్పారు.