అటవీ జంతువుల మాంసంతో అక్రమ వ్యాపారం

దర్యాప్తు ముమ్మరం చేసిన అధికారులు

జనగామ,జూలై2(జ‌నం సాక్షి): అడవి జంతువుల రవాణాపై అటవీ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. అడవి మాంసాన్ని పెద్ద ఎత్తున అమ్మకం ద్వారా కొందరు డబ్బులు సంపాదిస్తున్నారని గుర్తించారు.వరాఉ. జిల్లా కేంద్రం విూదుగా అడవి జంతువుల అక్రమ రవాణా యథేచ్ఛగా కొనసాగుతోంది. అడవిజంతువుల మాంసానికి బహిరంగ మార్కెట్‌లో గిరాకీ ఉన్న దృష్ట్యా అక్రమార్కులు పెద్ద ఎత్తున రవాణా చేస్తున్నట్లు సమాచారం. జంతువుల మాంసాన్ని ఎక్కువగా దాబాలు, రెస్టారెంట్లు, ప్రముఖ ¬టళ్లకు సరఫరాచేస్తున్నట్లు తెలుస్తోంది. జంతువు మాంసానికి ఉన్న డిమాండ్‌ను బట్టి కిలోకి రూ. 200 నుంచి రూ. 500 వరకు ధర నిర్ణయించి సొమ్ము చేసుకుంటున్నారు. అంతేగాకుండా ఈ వ్యాపారులు ఆదివారం రోజున మాంసాన్ని కిలో ప్యాకెట్ల చొప్పున తయారు చేసి తెలిసిన వ్యక్తుల ఇండ్లకు చేరవేస్తున్నట్లు తెలుస్తోంది. ఎవరికీ అనుమానం రాకుండా మేక, గొర్రెల మాంసంగా బయటకు ప్రచారం చేస్తున్నట్లు సమాచారం. అడవి పందులు, కుందేళ్లు, జింకలు, దుప్పులు, నెమళ్లు, ఇతర పక్షులను తరలిస్తున్నట్లు తెలుస్తోంది. అక్రమార్కులు ఎవరికీ అనుమానం రాకుండా అర్ధరాత్రి తర్వాత ఈ జంతువులను రవాణా చేస్తున్నట్లు వినికిడి. ఆ సమయంలో పోలీసుల నిఘా తక్కువగా ఉండటంతో అదును చూసి తరలిస్తున్నట్లు సమాచారం. ఒకవేళ ఎవరికైనా అనుమానం వస్తే వారిని మేనేజ్‌ చేసేందుకు వ్యాపారులు సైతం వాహనంతో పాటు ప్రయాణిస్తున్నట్లు తెలుస్తోంది. అక్రమ సంపాదనకు అలవాటు పడిన వ్యక్తులు అటవీ జంతువులను వ్యాపార మార్గంగా ఎంచుకున్నట్లు తెలుస్తోంది. వేటగాళ్ల సాయంతో అడవి జంతువులను పట్టుకుని ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నట్లు సమాచారం. వరంగల్‌కు చెందిన వ్యక్తులు సిద్దిపేట జిల్లా నుంచి అడవి జంతువులను కొనుగోలు చేసి రహస్య ప్రదేశానికి తరలించుకు పోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. కొంతకాలంగా గుట్టుచప్పుడు కాకుండా కొనసాగుతున్న ఈ వ్యవహారం ఆదివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంతో వెలుగు చూసింది. సిద్దిపేట నుంచి అడవి జంతువులను ట్రాలీ ఆటోల ద్వారా వరంగల్‌కు రవాణా చేస్తున్నట్లు తెలుస్తోంది. జంతువులు అక్కడికి చేరిన తర్వాత అక్రమార్కులు వాటిని చంపి మాంసంగా మార్చి విక్రయించి సొమ్ము చేసుకుంటున్నట్లు సమాచారం. ఈ అక్రమ రవాణా వెనక వరంగల్‌కు చెందిన వ్యక్తులు ప్రమేయం ఉన్నట్లు గుర్తించిన పోలీసులు, అటవీశాఖ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. వారానికి రెండు సార్లు సిద్దిపేట జిల్లా నుంచి జిల్లా కేంద్రం విూదుగా పెద్ద సంఖ్యలో అడవి జంతువులను రవాణా చేస్తున్నట్లు సమాచారం. జిల్లా కేంద్రంలో అడవి పందులతో వెళ్తున్న ఆటో ట్రాలీ రోడ్డు ప్రమాదానికి గురవడంతో అక్రమ రవాణా వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ నేపథ్యం లో పోలీసులు, అటవీ అధికారులు జరిగిన సంఘటనపై దర్యాప్తు ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన క్రమంలో డ్రైవర్‌కు స్వల్ప గాయాలవగా ఇద్దరు వ్యక్తులు పరారైనట్లు సమాచారం. అయితే పరారైన వారు వరంగల్‌కు చెందిన వారై ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ మేర కు ఆ వ్యక్తుల సమాచారం కోసం డ్రైవర్‌ను విచారిస్తున్నట్లు తెలుస్తోంది. డ్రైవర్‌ పోలీసులకు సహకరిస్తే అక్రమ రవాణా వెనుక ఉన్న వ్యక్తుల బయటకు వ చ్చేఅవకాశమున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు.