అటవీ శాఖ కార్యాలయం ఎదుట బిజెపి నాయకులు ధర్నా

 అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్
 నర్సాపూర్. సెప్టెంబర్, 20, (  జనం సాక్షి ) :
 మెదక్ జిల్లా లో  అవినీతిమయంగా మారిందని భూముల  కుంభకోణాలతో విచ్చలవిడిగా సాగుతుందని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు నర్సాపూర్ ఇన్చార్జి సింగంపల్లి గోపి అన్నారు.
 మంగళవారం నాడు నర్సాపూర్ పట్టణంలోని అటవీ శాఖ కార్యాలయం ఎదుట బిజెపి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు.
 అనంతరం  బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సింగయిపల్లీ గోపి,  నర్సాపూర్ అసెంబ్లీ కన్వీనర్  రాజేందర్,  జిల్లా కార్యదర్శి  సురేష్, రాష్ట్ర నాయకులు  మల్లేష్ గౌడ్,  రఘువీరా రెడ్డి తదితరులు మాట్లాడుతూ  నర్సాపూర్ పరిధిలోని అటవీ భూముల లో ఫామ్ హౌస్ ల  పేరుతో విచ్చలవిడిగా చెట్లను నరికి వేస్తున్నారని ఆరోపించారు.  ఇందులో భాగంగానే రైతులను గిరిజనులను   తీవ్ర ఇబ్బందులకు  గురి చేస్తున్నారని అన్నారు.   నర్సాపూర్ మండల పరిధిలోని చిన్న చింతకుంట గ్రామంలో ఫ్యాక్టరీ పేరుతో నిర్మాణాలు చేపడితే అక్కడి రైతులు తిరగబడ్డ విషయం గుర్తు చేశారు.
 నర్సాపూర్ పట్టణంలోని అయ్యప్ప దేవాలయం భూములను హైదరాబాద్కు చెందిన ఓ వ్యక్తి ఏడు ఎకరాలు కొనుగోలు చేస్తే అందులో నాలుగు ఎకరాలకు దొంగ డాక్యుమెంట్లు తయారుచేసి  చేసినట్లు తెలిపారు.
  అనంతరం నర్సాపూర్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ కు సమస్యలతో కూడిన వినతి పత్రం అందజేశారు.
 ఈ కార్యక్రమంలో నర్సాపూర్ నియోజకవర్గంలోని ఆయా మండలాలకు చెందిన బిజెపి మండల శాఖ అధ్యక్షులు నాయకులు కార్యకర్తలు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు
Attachments area