అట్టహాసంగా 75వ స్వాతంత్ర్య వేడుకలు

రామకృష్ణాపూర్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సంధర్బంగా అధ్యక్షులు వెంగలదాస్ సంతోష్ కుమార్, వర్కింగ్ ప్రెసిడెంట్ పిలుమల్ల గట్టయ్య జెండా ఆవిష్కరించి జాతీయ గీతాన్ని ఆలపించారు. అనంతరం వారు మాట్లాడుతూ మహనీయుల త్యాగ ఫలితమే నేడు స్వాతంత్య్ర భారతదేశమని పేర్కొన్నారు. 75 ఏండ్లలో దేశం సాధించిన ప్రగతిని గుర్తుచేసుకుంటు, మహనీయుల ఆశయ సాధనాలు నెరవేర్చాలని యువతకు పిలుపినిచ్చారు. జెండా ఆవిష్కరణలో భాగస్వాములై దేశభక్తిని చాటి రాబోయే తరాలకు నిదర్శనంగా నిలవాలని ప్రజలను కోరారు. ఈ వేడుకల్లో ప్రధాన కార్యదర్శి కనుకుంట్ల సుభాష్, ఉపాధ్యక్షుడు అరెల్లి గోపికృష్ణ, కమిటీ సభ్యులు పోనుగంటి దుర్గ రాజేంద్ర ప్రసాద్, కొండ శ్రీనివాస్, పరికిపండ్ల భరత్,ఎల్కాటూరి నరేష్, దండు సదానందం, బత్తుల నరేష్, శ్రీనాథ్, గంగన్న యాదవ్, వెంకటస్వామి, రవి పాల్గొన్నారు.