అత్యంత వైభవంగా శ్రీరామలింగేశ్వర జాతర ఉత్సవాలు.
అత్యంత మహిమాన్వితుడు రామలింగేశ్వరుడు.
తాండూరు అగస్టు 23(జనంసాక్షి)వికారాబాద్ జిల్లా తాండూరు మండలం జీన్ గుర్తి గ్రామ శివారు లోని ఆహ్లాదకరమైనవాతావరణంలో వెలసిన శ్రీ రామలింగేశ్వర దేవాలయంలో శ్రావణ మాసం సోమవారం ముగింపు సందర్భంగా ఆలయంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు జాతర ఉత్సవాలు వైభవంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ గౌడ్ల ప్రవీణ్ గౌడ్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం జాతర ఉత్సవాలు నిర్వహించడం జరిగిందని తెలిపారు.అత్యంత మహిమాన్వితు డు రామలింగేశ్వరుడని అన్నారు. స్వామి వారి అశిస్సు భక్తుల పై ఉండాలని ప్రార్థించారు. రైతు సమన్వయ సమితి అధ్యక్షులు రామలింగారెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యే సహా కారంతో ఆలయ అబివృద్ది చెందిందని పేర్కొన్నారు. రాబోయే శివరాత్రి, కార్తీక మాసంలో శివాలయంలో అద్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు .శ్రావణ మాసం ముగింపు సందర్భంగా ఆలయంలో వెలసిన పరమేశ్వరుని కి ప్రత్యేక పూజలు నిర్వహించామని తెలిపారు. భక్తుల కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా విరాజిల్లుతున్న రామలింగేశ్వర స్వామి.. అత్యంత మహిమాన్వితుడని వివరించారు.
దైవభక్తి అలవర్చుకోవాలన్నారు. రామలింగేశ్వర ఆలయంఅతిపూరతనమైన ఆలయమని తెలిపారు.ఈ కార్యక్రమంలో రైతుసమన్వయ సమితి అద్యక్షులు రామలింగారెడ్డి,తాండూరు మార్కెట్ కమిటీ డైరెక్టర్ సప్రగిరీ గౌడ్ ,మహిళా నాయకరాలు ,శకుంతల, ఉమాశంకర్,
బిజెపి మండల అధ్యక్షులు శేఖపురం ఆంజనేయులు, రమేష్ ముదిరాజ్, పోలేపల్లి కృష్ణ, శ్రీకాంత్ మోహన్, వెంకటేష్, అంజి తదితరులు ఉన్నారు.ఆశమళ్లి.
ప్రదిప్ రెడ్డి.అలయ పూజారి తదితరులు పాల్గొన్నారు.