అదనపు కోర్టుల మంజూరి కి కృషి చేయాలి
హుజూర్ నగర్ జూన్ 6 (జనం సాక్షి): కక్షిదారులకు మెరుగైన సేవలు, సత్వర న్యాయం అందించుట కొరకు న్యాయవాదులు కృషి చేయాలని జూనియర్ సివిల్ జడ్జి సంకేత్ మిత్ర న్యాయవాదులను కోరారు. బార్ అసోసియేషన్ అధ్యక్షులు సాముల రామిరెడ్డి జన్మదిన సందర్భంగా బుధవారం బార్ అసోసియేషన్ హాల్ నందు ఏర్పాటుచేసిన జన్మదిన వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొని న్యాయవాదులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. సీనియర్ సివిల్ జడ్జి కోర్టు మంజూరు చేయించడం, మూడు కోట్ల 30 లక్షల రూపాయలతో అత్యాధునికమైన న్యాయస్థాన భవన సముదాయాన్ని మంజూరు చేయించడం తదితర న్యాయస్థాన, న్యాయవాదుల అభివృద్ధికి సాముల రామిరెడ్డి చేసిన సేవలు అభినందనీయమన్నారు. ఆయనను స్ఫూర్తిగా తీసుకొని మిగతా న్యాయవాదులు కూడా న్యాయస్థాన అభివృద్ధికి తమ వంతు సహకారాన్ని అందించాలని ఆయన న్యాయవాదులకు సూచించారు. అనంతరం కేకును కట్ చేసి న్యాయవాదులు మిఠాయిలు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధికార ప్రతినిధి కాల్వ శ్రీనివాసరావు, సీనియర్ సివిల్ జడ్జ్ కోర్టు ఏ. జి. పి. ఉప్పల గోపాలకృష్ణమూర్తి, ఉపాధ్యక్షులు చనగాని యాదగిరి, సీనియర్ న్యాయవాదులు నట్టే సత్యనారాయణ, అంబటి శ్రీనివాస్ రెడ్డి, భట్టిపల్లి ప్రవీణ్ కుమార్, వట్టికూటి అంజయ్య, రమణారెడ్డి, లతీఫ్, చంద్రయ్య, జక్కుల వీరయ్య, పిన్నపరెడ్డి వెంకట్ రెడ్డి, కొట్టు సురేష్, బానోతు సురేష్ నాయక్, జుట్టుకొండ సత్యనారాయణ, గొట్టే ప్రశాంత్, తదితరులు పాల్గొన్నారు.