అద్దాఖ్‌లో కొత్తగా ఐదు జిల్లాలు

సుసంపన్నమైన లద్దాఖ్‌ నిర్మాణమే లక్ష్యం
ఎక్స్‌ వేదికగా వెల్లడిరచిన హోంమంత్రి అమిత్‌ షా
న్యూఢల్లీి,ఆగస్ట్‌26 (జనం సాక్షి):  కేంద్ర పాలిత ప్రాంతం లద్దాఖ్‌కు సంబంధించి ప్రధాని మోదీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆ ప్రాంతంలో కొత్తగా ఐదు జిల్లాలు ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా.. ఎక్స్‌ వేదికగా ప్రకటించారు. దీనికి సంబంధించిన కార్యచరణ త్వరలోనే ప్రారంభించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా అమిత్‌ షా..‘సుసంపన్నమైన, అభివృద్ధి చెందిన లద్దాఖ్‌ను నిర్మించేందుకు ప్రధాని మోదీ ఆధ్వర్యంలో ఐదు కొత్త జిల్లాలు ఏర్పాటు చేయాలని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ నిర్ణయించింది. షామ్‌, నుబ్రా, జన్‌స్కర్‌, ద్రాస్‌, చాంగ్‌థాంగ్‌ అనే ఐదు జిల్లాలను త్వరలో ఏర్పాటు చేయనున్నాం. దీని ద్వారా పాలన మరింత పటిష్టం అవుతుంది. ఇకపై ప్రతి ఇంటికీ ప్రభుత్వ ఫలాలు మెరుగ్గా అందుతాయి. లద్దాఖ్‌ ప్రజలకు మెరుగైన అవకాశాలు కల్పించేందుకు సిద్ధంగా ఉన్నాం’ అని రాసుకొచ్చారు. 2019లో అప్పటి ఎన్డీయే ప్రభుత్వం ఆర్టికల్‌ 370ని రద్దు చేసి జమ్మూకశ్మీర్‌ రాష్టాన్న్రి రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించింది. ఒకటి జమ్మూకశ్మీర్‌ అయితే మరొకటి లద్దాఖ్‌. అప్పట్నుంచి లద్దాఖ్‌ ప్రాంతంలో లేప్‌ా, కార్గిల్‌ అనే రెండు జిల్లాలు మాత్రమే ఉన్నాయి. ఈ ప్రాంతం కేంద్ర హోంమంత్రిత్వ శాఖ పరిధిలో ఉంటుంది. తాజా నిర్ణయంతో జిల్లాల సంఖ్య ఏడుకు పెరగనున్నాయి. దీనిపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ సైతం స్పందించారు. లద్దాఖ్‌ ప్రజలకు మంచి పాలన అందించేందుకు ఇది ఒక మంచి అవకాశం ఆయన చెప్పారు. కొత్త జిల్లాల ఏర్పాటుతో కేంద్ర ప్రభుత్వ ఫలాలు కిందస్థాయి వరకూ చేరుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా లద్దాఖ్‌ ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ ప్రధాని మోదీ ఓ ట్వీట్‌ చేశారు.