అద్వానీ కాళ్ళు పట్టుకున్న…..గడ్కరీ….!
న్యూఢిల్లీ : నవంబర్ 8, (జనంసాక్షి):
బీజేపీ అధ్యక్షుడు నితిన్ గడ్కరీ గురువారం సీనియర్ పార్టీ నేత లాల్‌కిషన్ అద్వానీని కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. గడ్కరీపై అవినీతి ఆరోపణలు రావటంతో ఆయన ఇంకా పదవిలో కొనసాగటంపట్ల అద్వానీ అసంతృప్తి వ్యక్తం చేశారు.ఈ నేపధ్యంలో సమావేశంలో పాల్గొన్న
బిజెపి ఢిల్లీ శాఖ నేత విజయ్‌జాలీ మాట్లడుతూ ఇద్దరి మధ్య సుహృదాయపుర్వాక వాతవారణంలో చర్చలు జరిగాయన్నారు.. అద్వానీకి పాద నమస్కారం చేసి ఆయన ఆశీస్సులను గడ్కరీ అందుకున్నట్లు తెలిపారు. గడ్కరీ పార్టీ అధ్యక్షుడిగా కొనసాగింపు పట్ల పార్టీలో కొన్ని వర్గాలు వ్యతీరేకిస్తుండగా మరి కొంత మంది సమర్దిస్తున్నారు.. మంగళవారం జరిగిన పార్టీ అత్యున్నత స్థాయి సమావేశంలో ఆయనకు పూర్తి మద్దతు ప్రకటించారు. కానీ పార్టీ కోర్ గ్రూప్ సమావేశానికి అద్వానీ హజరుకాలేదు.. గడ్కరీపై అవినీతి ఆరోపణలు మీడియాలో రావటంతో ఇది పార్టీ ఎంపి రామ్‌జేఠ్మలా డిమాండ్ చేశారు కోర్‌గ్రూప్‌లో సిన్హా లాంటి సీనియర్ నేతలు గడ్కరీపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు చివరకు అద్వానీ కూడా అలాగే ఉండటంతో గడ్కరీపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు చివరకు అద్వానీ కూడా అలాగే ఉండటంతో గడ్కరీ జన్మదినం సాకును అడ్డు పెట్టుకేని ఆయనకు పాదనమస్కారం చేసినట్లు తెలుస్తోంది.