అధికారంలోకి రాగానే పోడు భూములకు పట్టాలిస్తాం వైయస్ షర్మిల
దండేపల్లి .జనంసాక్షి 21 అధికారంలోకి రాగానే పొడు భూములకు పట్టాలిస్తాం అని వై యస్ షర్మిల అన్నారు గురువారం షర్మిల పర్యటనలో భాగంగా మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం కోయపోష గూడెం లో పర్యటించారు కోయపోషగూడెంలో ఆదివాసుల బాగోగులు తెలుసుకొని వారికి అండగా నిలుస్తానని అన్నారు అనంతరం ఆమె మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడక బంగారు తెలంగాణ చేస్తానన్న ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఇప్పుడు ఎక్కడున్నారని ప్రశ్నించింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి రాగానే మూడు ఎకరాల భూమి రెండు పడకల గది పోడు భూములకు పట్టాలు ఇప్పిస్తానని చెప్పిన ముఖ్యమంత్రి ఇప్పుడు ఎక్కడున్నారని అడిగింది ఆదివాసులైన మహిళ లు అని చూడకుండా పోలీస్ అధికారులు ఫారెస్ట్ అధికారులు ఆదివాసులను మహిళలు అని చూడకుండా గుడ్డలిప్పి కొడుతూ అక్రమ కేసులు పెట్టడం సరికాదని అన్నారు మహిళలను జైల్లో పెట్టి వారం రోజులు ఉంచడంతో చిన్న పిల్లలతల్లులకు పాలు వెనుతిరిగాయని ఒకమహిళ రెండు నెలల పసి పాపను వదిలి పెట్టి జైలు కు వెళ్లడంతో ఆ పాప తల్లిని మరసిపోవడం జరిగింది అన్నారు రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని తప్పులు చేసిన ప్రజలు ఏమి అనక పోతున్నారని అన్నారు ఇది దొరల పాలన కొనసాగుతుందని అన్నారు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని అన్నారు కాంగ్రెస్ హయంలో ఆదివాసుల కు అప్పటి ముఖ్యమంత్రి స్వర్గీయ వైఎస్ రాజశేఖరరెడ్డి పోడు భూముల కు పట్టాలు ఇచ్చాడని అన్నారు రాష్ట్ర విభజన తరువాత బంగారు తెలంగాణా చేస్తానన్న ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ పాలన తప్ప ప్రజలను పట్టించుకోకుండా ఫామ్ హౌస్ లో నిద్రపోతన్నడాని అన్నారు ఇప్పటికైనా ఆదివాసులపై పెట్టిన అక్రమ కేసులను తొలగించి ఆదివాసుల పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని అన్నారు గిరిజన గ్రామాలకు రోడ్లు సరిగా లేక అంబులెన్స్ సౌకర్యం కలగకపోవడంతో అక్కడ ఉన్న ఆదివాసులు రోగాల బారినపడి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు వైయస్సార్ తెలంగాణ పార్టీ అధికారంలోకి రాగానే అక్రమ కేసులను తొలగించి పోడు భూములకు పట్టాలు ఇస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో వైఎస్సార్ తెలంగాణ పార్టీ నాయకులు ఆదివాసీ మహిళలు ఆదివాసీ నాయకులు తదితరులు పాల్గొన్నారు