అధ్వానంగా మారిన అంతర్గత రోడ్లు,
-రాకపోకలు ఇబ్బంది పడుతున్న గ్రామస్తులు,
-పట్టించుకోని అధికారులు,
సిర్పూర్ మండల కేంద్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు మండలంలోని భూపాలపట్నం నుండి కేశవపట్నం వెళ్లవలసిన అంతర్గత రోడ్డు అద్వానంగా మారింది, గ్రామాని అధికారులకు కొంచెం కూడా పట్టడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్న గ్రామస్తులు, అధికారుల
నిర్లక్ష్యం వల్లనే రోడ్లు అధ్వానంగా మారి నట్లు ప్రజలు ఆరోపిస్తున్నారు. దీంతో రాకపోకలు స్తంభించాయి. మండలం లోని ఆయా గ్రామాల రోడ్లు వరదల తాకిడికి ధ్వంసం కాగా, కొన్నిచోట్లలో రోడ్డు కొట్టుకుపోయింది. మట్టి రోడ్లపై వర్షపు నీరు నిలువడంతో గుంతలు తెలియకపోగా, భారీ వాహనాలకు ఇబ్బందులు ఇబ్బందులకు గురవుతున్నాయి. గుంతలుగా మారిన రోడ్లు మరింత ధ్వంసం అవుతున్నాయి.ప్రభుత్వం గ్రామీణ రోడ్లపై దృష్టి పెట్టకపోవడంతో చిన్నపాటి వర్షానికే రోడ్లు జలమయం అవుతున్నాయి. ఈ రోడ్లపై గ్రామీణ ప్రాంత ప్రజలు తిరగలేక ఇబ్బందులు పడుతున్నారు. రైతులు సైతం అంతర్గత రోడ్లు దెబ్బతినడంతో పొలాలకు రసాయనిక ఎరువులు తీసుకెళ్లలేక ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రోడ్లు, మరమ్మతులు చేయించాలని కేశవపట్నం ప్రజలు కోరుతున్నారు.
– సగటు ఆత్మారావు గ్రామస్తుని ఆవేదన
గ్రామాల్లో అంతర్గత రోడ్లు మరీ అధ్వానంగా మారాయి. దీనికి తోడు గ్రామాల్లో ఎక్కడా సైడు కాలువలు లేకపోవడంతో వర్షపు నీటితో పాటు, ఇళ్లలో వాడుకున్న వృథా నీరంతా రోడ్లపైనే నిలుస్తోంది. దీంతో దుర్వాసన వెదజల్లుతూ ఇబ్బందికరంగా మారింది. జ్వరాలు కూడా వ్యాప్తిచెందే అవకాశం ఉండటంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. ఇప్పటికైనా అధికారులు, పాలకులు గ్రామాల అంతర్గత రహదారులపై దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు.
-నడవాలంటే ఇబ్బందిగా ఉంది, (స్కూల్ టీచర్….. సంగీత.)
మట్టిరోడ్డు పూర్తిగా దెబ్బతిని నడిచేందుకు సైతం వీలు కావడం లేదు. రోడ్డుపై నీరు నిలిచి బురదగా మారడంతో ఆ బురదలోనే నడుస్తున్నాం. స్కూల్ కి వెళ్దామంటే చాలా కష్టంగా ఉంటుంది, ఇప్పటికైనా అధికారులు రోడ్డు వేయించాలి. రోడ్లు, మరమ్మతులు చేయించాలని మండల ప్రజలు కోరుతున్నారు. -పాదచారులకూ, వాహనదారులకూ ఇబ్బంది,