అనాదలకు అండగా ఉండండి.
తీన్మార్ నవీన్.
ఫోటో రైటప్: అనాధ ఆశ్రమానికి గుంజులు పంపిణీ చేస్తున్న నవీన్.
బెల్లంపల్లి, ఆగస్టు23, (జనంసాక్షి)
అనాదలకు అండగా ఉండాలని తీన్మార్ ఛానల్ పాత్రికేయుడు శ్రీరాముల నవీన్ పిలుపునిచ్చాడు. మంచిర్యాల జిల్లా కేంద్రం కాలేజి రోడ్డులో గల కల్వరి యువశక్తి అనాథ ఆశ్రమానికి ఆయన వంట గుంజులు పంపిణీ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ అనాధాశ్రమంలో వృద్ధులు, మతిస్థిమితం లేని తొమ్మిది మంది ఉన్నారని. ఈ ఆశ్రమాన్ని కుమార్ అనే వ్యక్తి తన స్వంత ఖర్చుతో నిర్వహిస్తున్నాడని, నేను సైతం తోటి వారికి పాటుపడాలనే ఉద్దేశంతో ఈకార్యక్రమం నిర్వహించినట్లు పేర్కొన్నారు. మానవత్వం ఉన్న వారు తలో చేయి వేసిమానసిక వికలాంగులకు మనోధైర్యం ఇచ్చేవిధంగా ఆర్థిక సాయం అందించి ఆదుకోవాలని కోరారు. ఈకార్యక్రమంలో తోటి మిత్రులు పాల్గొన్నారు.