అనాధ బాలుని దత్తత తీసుకున్న డాక్టర్ కల్నల్ మాచర్ల బిక్షపతి ముదిరాజ్
జనగామ రూరల్(జనం సాక్షి)ఆగస్ట్7:జనగామ మండలంలోని వడ్లకొండ గ్రామంలో పుట్టుకతోనే తల్లి మరణించగా గత నెలలో తండ్రి కూడా మరణించి గా అనాధగా మిగిలిపోయినాడు గోనె ఉపేందర్ 13 సంవత్సరాలు అబ్బాయిని పెద్ద మనసుతో అబ్బాయిని దత్తతగా తీసుకున్న ఆర్మీ రిటైర్డ్ డాక్టర్ కల్నల్ మాచర్ల బిక్షపతి ముదిరాజ్ , ప్రస్తుతం ఇప్పుడు 8 తరగతి చదువుతున్న అబ్బాయిని 12వ తరగతి వరకు వారి చదువు కోసం పూర్తి ఖర్చులు భరిస్తూ వారిని దత్తత తీసుకున్నారు ఈ కార్యక్రమంలో ఆదిత్య హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ జైన రమేష్ మరియు తెలంగాణ ముదిరాజ్ మహాసభ జనగామ జిల్లా ప్రధాన కార్యదర్శి కట్ల సదానందం పాల్గొని జాతి ప్రయోజనాల కోసం శ్రమిస్తున్న డాక్టర్ బిక్షపతి ముదిరాజ్ కి తెలంగాణ ముదిరాజ్ మహాసభ పక్షాన వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుస్తున్నారు నర్మెట ముదిరాజ్ యూత్ నాయకులు పులి ప్రవీణ్ ముదిరాజ్ మరియు వడ్లకొండ కుల పెద్దమనుషులు సొసైటీ నాయకులు గోనె శ్రీనివాస్ గోనే సత్తి సొసైటీ అధ్యక్షులు రాంనర్సయ్య మరియు గోనె సిద్ది రాజయ్య గోనె కిష్టయ్య హరీష్ ముదిరాజ్ తదితరులు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరచారు.