అనారోగ్యం వల్ల మాజీ మంత్రి శ్రీపతి రాజేశ్వర్‌ కన్నుమూత

హైదరాబాద్‌: మాజీ మంత్రి శ్రీపతి రాజేశ్వర్‌ కన్నుమూశారు. కొంతకాలంగా మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్న ఆయన ఈ ఉదయం నిమ్స్‌లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఎన్టీఆర్‌ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన రాజేశ్వర్‌ ఎన్టీఆర్‌ అభిమాన సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఉన్నారు. శ్రీపతి రాజేశ్వర్‌ భౌతికకాయాన్ని మారేడ్‌పల్లిలోని ఆయన స్వగృహానికి తరలించారు.