అనుమానాస్పద స్థితిలో ఖైదీ మృతి
వరంగల్, జనంసాక్షి: వరంగల్ సెంట్రల్ జైల్లో శివమణి అనే ఖేదీ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. దాంతో మృతుని కుటుంబ సభ్యులు గురువారం జైలు ఎదుట ఆందోళనకు దిగారు. హన్మకొండ మండలం గుండ్లసింగారం గ్రామానికి చెందిన సొమాని గుండుంబా విక్రయం కేసులో రిమాండ్ ఖేదీగా వచ్చాడు.
గుడుంబా రవాణా కేసులో అతనికి కోర్టు నిన్ననే బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ రావడంతో ఆటోలో అతన్ని జైటు అధికారులు బయటకు పంపారు. అయితే అప్పటికే సొమాని మృతి చెందటంతో మృతదేహంతో బంధువులు ధర్నాకు దిగారు . కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అయితే అనారోగ్యం కారణంగానే శివమణి మృతి
చెందాడని జైలు అధికారులు చెబుతున్నారు.