అనుష్కతో బర్త్ డే సెలబ్రేట్ చేసుకున్న విరాట్
టీమిండియా స్టార్ ఆటగాడు, టెస్ట్ ఫార్మాట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ శనివారం పుట్టిన రోజు వేడుకను ఘనంగా జరుపుకున్నాడు. శనివారం విరాట్ సరిగ్గా 28 వసంతాలు పూర్తి చేసుకుని 29వ వసంతంలోకి ప్రవేశించాడు. ఆ రోజు కోహ్లీ ముందుగా తన ప్రియురాలు అనుష్కతో కలిసి జాలీగా బర్త్ డే సెలబ్రేట్ చేసుకున్నాడు. టీమిండియా ఆటగాళ్లు గౌతమ్ గంభీర్, ఇషాంత్ శర్మ, జయంత్ యాదవ్, అమిత్ మిశ్రా, ఛతేశ్వర్ పుజారా, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, హార్దిక్ పాండ్య కోహ్లీ జన్మదిన వేడుకల్లో పాల్గొన్నారు.