అన్నా చెల్లెళ్ల ఆత్మీయ బంధానికి ప్రతీక రక్షాబంధన్
జనం సాక్షి,వంగూర్:
అన్నా చెల్లి ఆత్మీయ బంధానికి రక్షాబంధన్ అని పరిసర గ్రామాల్లో శుక్రవారం రాఖీ పండగ పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. అక్కా చెల్లెలు తమ సోదరులకు రాఖీలు కట్టి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వివిధ గ్రామాలలో ఉన్న ఆడపడుచులు మెట్టిని ఇంటి పుట్టింటికి వచ్చి తమ అన్నదమ్ములకు రాఖీలు కట్టి సోదర భావాన్ని చాటారు. నువ్వు నాకు రక్ష నేను నీకు రక్ష అంటూ పుట్టింటి వారు ఎల్లప్పుడూ తమకు రక్షణగా ఉండాలని కోరుతూ ఆత్మీయతను చాటుకున్నారు.
