అన్ని దానాలకన్న అన్నదానం గోప్పది.
అన్నం పరబ్రహ్మ స్వరూపం.
యాలాల్ మాజీ జడ్పీటీసీ సిద్రాల శ్రీనివాస్.
తాండూరు అగస్టు21(జనంసాక్షి)వికారాబాద్ జిల్లా యాలాల మండలంజుంటుపల్లి శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయంలో శనివారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యాలాల్ మాజీ జడ్పీటీసీ సిద్రాల శ్రీనివాస్ పాల్గొని స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని దానాలకన్న అన్నదానం ఎంతో గోప్పదానమన్నారు.అన్నం పరబ్రహ్మ స్వరూపమన్నారు.ప్రతి ఒక్కరూ భక్తి శ్రద్ధలతో
శ్రీరామ చంద్రమూర్తిని కోలవాలన్నారు.భక్తి లోనే మూక్తిలబిస్తుందన్నారు.ఈ కార్యక్రమంలో జుంటుపల్లి గ్రామ మాజీ సర్పంచ్, ఆలయధర్మకర్త రాఘవేందర్ రావు దొర, అక్కంపల్లి సర్పంచ్ లక్ష్మీనారాయణ, యాలాల్ మండల బీసీ సంఘం అధ్యక్షులు లక్ష్మణ చారి వివిధ గ్రామాల ప్రజలు భక్తులు స్వామివారి తీర్థ ప్రసాదాలను స్వీకరించి స్వామి ఆశీస్సులు పొందారు.