అన్ని నదుల్లో వాజ్‌పేయీ అస్థికలు నిమజ్జనం

– సీఎం యోగి ఆదిత్యానాథ్‌ ప్రకటన
లఖ్‌నవూర్‌, ఆగస్టు18(జ‌నం సాక్షి) : మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయీ అస్థికలను ఉత్తరప్రదేశ్‌లోని అన్ని నదుల్లో నిమజ్జనం చేయాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆధిత్యానాథ్‌ నిర్ణయం తీసున్నారు. యూపీలోని 75జిల్లాల్లో చిన్నా, పెద్దా కలిపి అన్ని నదుల్లో వాజ్‌పేయీ అస్థికలను నిమజ్జనం చేయనున్నట్లు సీఎం తెలిపారు. మహానేత కర్మభూమి ఉత్తరప్రదేశ్‌ అయినందున వాజ్‌పేయీ అస్థికలను యూపీలో నిమజ్జనం చేయనున్నట్లు సీఎం ప్రకటించారు. ఈ కార్యక్రమంతో వాజ్‌పేయీ తుది ప్రయాణంలో ప్రజలకు పాల్గొనే అవకాశం వస్తుందని ఆయన పేర్కొన్నారు. లఖ్‌నవూ పార్లమెంటు స్థానం నుంచి 1991, 96, 98, 99,2004 సంవత్సరాల్లో వాజ్‌పేయీ ప్రాతినిధ్యం వహించారు. ఉత్తరప్రదేశ్‌లో శీతాకాలంలో ఏర్పాటుచేసే పునరావాస కేంద్రాలకు అటల్‌ జీ పేరు పెట్టాలని భాజపా నేతలు డిమాండ్‌ చేస్తున్నారు.