అన్న చెల్లెళ్ళ అనుబంధానికి ప్రతీక రాఖీ పండుగ- నార్సింగి మార్కెట్ కమిటీ చైర్మెన్ దూడల వెంకటేష్ గౌడ్
*రాజేంద్రనగర్.ఆర్.సి.(జనం సాక్షి)* అన్న చెల్లెళ్ళ అనుబంధానికి ప్రతీక రాఖీ పండుగ అని నార్సింగి మార్కెట్ కమిటీ చైర్మెన్ దూడల వెంకటేష్ గౌడ్ అన్నారు.
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ లోని తన నివాసంలో శుక్రవారం అక్కతో రాఖీ కట్టించుకున్న నార్సింగి మార్కెట్ కమిటీ చైర్మన్ దూడల వెంకటేష్ గౌడ్.
ఈ సందర్బంగా మాట్లాడుతూ అన్నా చెల్లెళ్ల అనుబంధానికి, అక్కా తమ్ముళ్ల అనురాగానికి ప్రతీక రాఖీ పండుగ అన్నారు.ఈ రక్షా బంధన్ వేడుకను ఘనంగా జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ
రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేశారు.మహిళల అభ్యున్నతి కోసం దేశంలో ఎక్కడా లేనివిధంగా అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ దిశగా అభివృద్ధి చేస్తున్న ముఖ్యమంత్రి మన కేసీఆర్ అన్నారు. టిఆర్ఎస్ ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేసిందని పేదంటే మహిళల పెళ్లిల కొరకు కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ పథకాలు ప్రవేశపెట్టి పెళ్లిళ్లు చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.
ఫోటో రైటప్ : శంషాబాద్ లో అక్కతో రాఖీ కట్టించుకుంటున్న మార్కెట్ కమిటీ చైర్మన్ వెంకటేష్ గౌడ్.