అబ్బురపరిచిన ముగ్గుల పోటీలు..

సముద్రం ఆగస్టు 20 జనం సాక్షి  /దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 75 వ భారత వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా మండల వ్యాప్తంగా పలు గ్రామాల్లో ముగ్గుల పోటీలు నిర్వహించారు.ఈ ముగ్గుల పోటీలలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని దేశ సంప్రదాయాలు,జాతీయ జెండా ప్రతిబింబించే విధంగా ముగ్గులు వేసి రంగులు అద్ది పలువురిని అబ్బురపరిచారు.
ఇనుగుర్తి:   గ్రామ సర్పంచ్ దార్ల రామ్మూర్తి ఆధ్వర్యంలో నిర్వహించిన ముగ్గుల పోటీలలో పాల్గొన్న మహిళలకు ముఖ్యఅతిథిగా విచ్చేసిన ప్రముఖ పారిశ్రామికవేత్త వద్దిరాజు దేవేందర్ విజేతలకు బహుమతి ప్రధానం చేశారు.మొదటి బహుమతి కుంచాల సులోచన, రెండవ బహుమతి ముల్క భవాని, మూడవ బహుమతి బండారి జయ శ్రీ, నాలుగో బహుమతి మామునూరి గౌతమి,ఐదవ బహుమతి  పిహెచ్సి (ఇనుగుర్తి), ప్రత్యేక బహుమతులు కూడా గెలుచుకున్నారు.ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ పింగిలి రజిత శ్రీనివాస్,గుగులోత్ నరేందర్,బండారు వెంకన్న, కర్ర నరసింహారెడ్డి, వేముల శ్రీనివాస్,ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
తాళ్ల పూస పెళ్లి:  గ్రామ సర్పంచ్ రావుల విజిత రవిచందర్‌ రెడ్డి ఆధ్వర్యంలో ముగ్గుల పోటీ ఘనంగా నిర్వహించారు.విజేతలుగా నిలిచిన ఫస్ట్ ప్రైజ్ నిమ్మల దివ్య, సెకండ్ ప్రైజ్ వంగా భార్గవి, థర్డ్ ప్రైజ్ రామగిరి స్వప్న లకు బహుమతి ప్రధానం చేశారు.ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రెటరీ దివాకర్,కారోబార్ సాగర్, నరేటి కొమరయ్య,సింహాద్రి,బోయిన ఉప్పలయ్య, దశరథం, వంశీ,మహిళా సంఘాలు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
బేరువాడ:  గ్రామ సర్పంచ్ ముదిగిరి సాంబయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన ముగ్గుల పోటీలలో విజేతగా నిలిచిన మొదటి బహుమతి ఈసం పుష్ప,రెండవ బహుమతి అంజలి భాయి,మూడవ బహుమతి ఈసం శ్రీ కన్య లకు బహుమతి ప్రధానం చేశారు.ఈ కార్యక్రమంలో  ఉపసర్పంచ్ రాజమణి భీముడు, వార్డ్ మెంబర్స్ ఐలయ్య, శ్రీలత, గ్రామ కార్యదర్శి శ్రీనివాస్,సి ఏ గోవర్ధన్, గ్రామ సిబ్బంది దేవయ్య,సురేష్, ఎల్లయ్య, ఏ ఎన్ ఎం లు, ఆశ వర్కర్స్, అంగన్వాడీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు