అభాగ్యలకు అండగా బీఆర్ఎస్ ప్రభుత్వం – నిరుపేద మహిళకు ఇంటిని మంజూరు చేస్తానని వాగ్దానం
– ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి
హుజూర్ నగర్ మార్చి 20 (జనంసాక్షి): అభాగ్యులకు అండగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటుందని హుజూర్ నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. సోమవారం పట్టణంలోని ఒకటవ వార్డులో కంటి వెలుగు కార్యక్రమం ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా వెళ్లి కార్యక్రమాన్ని పురస్కరించుకొని తిరిగి వస్తున్న సందర్భంలో ఆ వార్డులో వీధి, వీధి తిరుగుతూ చిన్న, చిన్న వస్తువులు అమ్ముకుంటూ కుటుంబాన్ని పోషించే ఒక నిరుపేద మహిళ ఎదురుపడగా ఆమెను, ఎమ్మెల్యే సైదిరెడ్డి పలకరించడం జరిగింది. ఎక్కడ ఉంటారు అని ఎమ్మెల్యే సైదిరెడ్డి విచారించగా తనకు ఇల్లు లేదని చాలా దిన పరిస్థితిలో ఉన్నామని ఎమ్మెల్యేని కలవాలని ఎప్పటినుంచో అనుకుంటున్నాను అని తను చెప్పడం, స్వయంగా ఎమ్మెల్యే ఇలా ఎదురుపడటం తనకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. తన పరిస్థితిని చూసి తప్పకుండా తనకు ఇల్లు ఇస్తానని ఎమ్మెల్యే ఆ నిరుపేద మహిళకు వాగ్దానం చేయడం జరిగింది. ఈ సందర్బంగా దేవుడే కాడికి వచ్చినట్లు, ఎమ్మెల్యే ఎదురుపడి ఇలా అడకుండానే వరం ఇవ్వడం నా అదృష్టం అని ఆ నిరుపేద మహిళ ఆనంద బాష్పాలతో దండం పెడుతూ చెప్పడం జరిగింది.