అభివృద్దికి సహకరించాలని మంత్రులకు జడ్పీ చైర్మన్ పుట్ట మధు వినతి
జనంసాక్షి, మంథని: పెద్దపల్లి జిల్లా మంథని నియోజకవర్గ అభివృద్దికి సహకారం అందించాలని ఆయా శాఖల మంత్రులను మంథని నియోజకవర్గ భీఆర్ఎస్ పార్టీ ఇంచార్జీ, పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధూకర్ కోరారు. గురువారం అసెంబ్లీ ప్రాంగణంలోని ఆయా శాఖల మంత్రులను వారి చాంబర్‌లలో మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రాలు అందజేశారు. పెద్దపల్లి నుంచి కాటారం వరకు రహాదారి నిర్మాణం కోసం మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి కి, బీసీ గురుకుల భవనాలను మంజూరీ చేసి నిర్మాణం చేయాలని మంత్రి గంగుల కమలాకర్ కి, ఆయా గ్రామాల్లో నూతన గ్రామపంచాయతీ భవనాల నిర్మాణానికి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కి వినతి పత్రాలను అందజేశారు. అలాగే ఇటీవలి కాలంలో గిరిజనుల కలలను సాకారంచేస్తూ పోడు భూములకు ప్రభుత్వం పట్టాలు పంపిణీ చేసిన క్రమంలో ఆ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ కీ కృతజ్ఞతలు తెలుపుడంతో పాటు వివిధ కారణాలతో ఆగిపోయిన కొంత మంది గిరిజనులకు పట్టాలు అందించాలని వినతి పత్రాలు అందజేశారు. మంథని నియోజకవర్గ అభివృధ్దికి సంపూర్ణ సహకారం అందించాలని ఆయన ఈ సందర్బంగా మంత్రులను కోరారు. వారి వెంట రాష్ట్ర యువ నాయకులు జక్కు రాకేష్ ఉన్నారు.