అమరుల త్యాగాలకు విలువేదీ?: సీతక్క
వరంగల్,జూన్22(జనం సాక్షి ): అమరవీరులు ప్రాణత్యాగాలు తెలంగాణ అభివృద్దికి పాటుపడడం లేదని గుర్తుపెట్టు కోవాలని మాజీ ఎమ్మెల్యే సీతక్క అన్నారు. కేసీఆర్ ఆరాచకాలను అడ్డుకోడానికి, తెలంగాణను అబివృద్ధి పథంలో నడపడానికి అలుపెరగని పోరాటాన్ని సాగిస్తామని ప్రకటించారు. కేసీఆర్ ఆరాచకాలను కాంగ్రెస్ పార్టీ ఎదుర్కొంటుందని, ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఆందోళన నిర్వహించామని గుర్తుచేశారు. టిఆర్‌ఎస్ ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని అన్నారు. అయితే ప్రస్తుతం టీఆర్‌ఎస్ ప్రభుత్వంలో బలహీన వర్గాలకు, మహిళలకు కూడా స్థానం లేదనే విషయాన్ని ప్రజలు గుర్తించారన్నారు. అభివృద్ధి చెందిన తెలంగాణ పరిస్థితి ఇప్పుడెలా ఉందో ప్రజలుచూస్తున్నారన్నారు. బలహీన వర్గాలకు, ఆడపడు చులకు, రైతులకు, దళితులకు, గిరిజన, మైనార్టీ విద్యార్థి వర్గాలకు న్యాయం జరగాలన్నదే తమ అభిమతమని అన్నారు. కేసీఆర్ తన అవసరాలకోసం, రాజకీయ ప్రయోజనాల కోసం తెలుగు ప్రజల మధ్య వైషమ్యాలు పెంచుతున్నారని ఆరోపించారు. వరంగల్ నగరంలో ఒకవైపురహదారులు లేకపోగా మరోవైపు పొంగిపొర్లుతున్న మురికి కాల్వల కరణంగా దోమల బెడద విపరీతంగా ఉందన్నారు. డబుల్‌బెడ్‌రూం ఇళ్లు ఇస్తామన్న హావిూలపై కార్యాచరణ లేదని ధ్వజమెత్తారు. నాలుగేళ్లయినా వీటిపై ప్రచారం తప్ప అడుగు ముందుకు పడడం లేదన్నారు.