అమిత్‌ షా పర్యటనతో కాశ్మీర్‌ ప్రజల్లో భరోసా


అభివృద్ది కార్యక్రమాలతో కొత్త శకం
ఉగ్రమూకలకు హెచ్చరికలు పంపేలా చర్చలు
న్యూఢల్లీి,అక్టోబర్‌25 ,(జనంసాక్షి):  కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా కాశ్మీర్‌ పర్యటనతో అక్కడి ప్రజల్లో భరోసా నింపే ప్రయత్నం చేశారు. అదే సందర్భంలో భద్రతా బలగాలకు విశ్వాసం కల్పించారు. అలాగే సరిహద్దు ఉగ్రవాదం విషయంలో కఠిన వైఖరి ఉంటందన్న హెచ్చరికా చేశారు. నిజానికి కాశ్మీర్‌లో చిచ్చు పెట్టడానికి,స్థానికుల్లో భయం కల్పించడానికి ఎప్పటినుంచో కుట్రలు చేస్తూనే ఉన్నారు. భారతదేశంలో భారీ విధ్వంసానికి పథక రచన చేయాలన్న ప్రతిసారీ పాక్‌ విఫలం అవుతూనే ఉంది. ముష్కర మూకలు దేశంలోకి ఎంటరయి చిచ్చు పెడుతూనే ఉన్నాయి. ఈ ప్రశ్నలన్నిటికి నిఘ వర్గాల నుంచి అవుననే సమాధానమే వస్తోంది. అందుతున్న వార్తలు కూడా అదే అంటున్నాయి. అయితే ఏం జరగబోతోందన్నదే అనుమానంగా ఉంది. జమ్మూ కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్‌ 370ను కేంద్ర రద్దుచేసిన తర్వాత దాయాది పాకిస్తాన్‌ భారత్‌పై మరింత ద్వేషాన్ని పెంచుకుంది. భారత్‌ చర్యలను వ్యతిరేకిస్తూ పలు అంతర్జాతీయ వేదికలపై గగ్గోలు పెడుతూనే ఉంది. తాజాగా వ్యూహం మార్చి కాశ్మీర్ల్‌ఓ సామాన్యులను లక్ష్యంగా చేసుకుని ఊచకోతలకు దిగుతోంది. సరిహద్దుల్లో ఉగ్రవాద శిబిరాలను మళ్లీ పునరుద్దరించింనట్లు సమాచారం వస్తోంది. దేశంలో భారీగా కల్లోలం సృష్టించటమే వారి లక్ష్యం. ఈ విషయాన్ని నిఘా వర్గాలు పసిగట్టాయి. జైషే మహ్మద్‌తో కలిసి పాక్‌ గూఢచారి సంస్థ ఐఎస్‌ఐ కాశ్మీర్‌లో కల్లోలం సృష్టించాలని చూస్తోంది. జమ్మూ కశ్మీర్‌లోని కీలక తమ అనుచరులను సైన్యం మట్టుబెట్టడంతో జైషే మహ్మద్‌కు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. వీటికి తోడు ఆర్టికల్‌ 370 రద్దుతో ఆ సంస్థ మరింత రగిలిపోతోంది. అందుకు ప్రతీకారంగా భారీ దాడులకు వ్యూహరచన చేసినట్టు తెలుస్తోంది. తాజాగా కాశ్మీర్‌లో జరుగుతన్న పరిణామాలపై అమిత్‌ షా సవిూక్షించారు. జమ్మూ ప్రజల పట్ల వివక్షకు ఇక ముగింపు పలికే సమయం ఆసన్నమైందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా అన్నారు. ఇకపై కశ్మీర్‌, జమ్మూ రెండూ కలిసి అభివృద్ధి చెందుతాయని, దీనిని ఎవరూ ఆపలేరని పేర్కొన్నారు. జమ్మూ కశ్మీర్‌లో మూడు రోజుల పర్యటనలో భాగంగా ఆదివారం రెండో రోజు జమ్మూలో రూ.210 కోట్లతో నిర్మించిన ఐఐటీ క్యాంప్‌సను ఆయన ప్రారంభించారు. . ఇక్కడ శాంతి, సామరస్యాలను దెబ్బతీయాలని చూస్తే ఉపేక్షించం. అభివృద్ధిని అడ్డుకోవాలని కొందరు ప్రయత్నిస్తున్నారు. కానీ, ప్రభుత్వ వారి ప్రయత్నాలను సాగనివ్వదు‘ అని అన్నారు. ఈ ప్రాంతానికి ఇప్పటికే రూ.12 వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయని, 2022 సంవత్సరాంతానికి రూ.51 వేల కోట్ల పెట్టుబడులు తీసుకురావాలన్నది ప్రభుత్వం లక్ష్యమని తెలిపారు. ప్రధాని నరేంద్రమోదీ కృషి వల్లే జమ్మూ కశ్మీర్‌లో ఆర్టికల్‌ 370 రద్దు సాధ్యమయిందన్నారు. లక్షలాది మంది ప్రజలను అన్యాయానికి గురి చేసిన, వివక్షా పూరితమైన ఈ ఆర్టికల్‌ అమలును రద్దు చేయడం ద్వారా క్షేత్రస్థాయిలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించి జమ్మూ కశ్మీర్‌లో అభివృద్ధికి మోదీ శ్రీకారం చుట్టారని తెలిపారు. దీంతో అన్ని వర్గాలవారు ఇక్కడ భూములు కొనుక్కునేందుకు, రాజ్యాంగం కల్పించిన హక్కులను పొందేందుకు అవకాశం లభించిందన్నారు. ఇకపై జమ్మూ కశ్మీర్‌లో ఎవరైనా మంత్రి, ముఖ్యమంత్రిగా కూడా ఎన్నిక కావచ్చని అన్నారు. ప్రతి కుటుంబానికీ ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందుతాయని పేర్కొన్నారు. జమ్మూ కశ్మీర్‌ ప్రజలపై ప్రేమతో ప్రధాని మోదీ ఇక్కడ హైడ్రో ఎలక్టిక్ర్‌ ప్రాజెక్టులు పూర్తి చేసేందుకురూ.35 వేల కోట్లు మంజూరు చేశారని తెలిపారు. మెడికల్‌ కాలేజీలు, నర్సింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌లు, ఎయిమ్స్‌ ఏర్పాటుచేసిన
విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఇలా అమిత్‌షా అభివృద్ది కార్యక్రమాల్లో పాల్గొంటూనే భద్రతపైనా సవిూక్షించారు. అమిత్‌ షా రాకతో కాశ్మీర్‌లో నిఘా పెంచారు. అనుమనాస్పద ప్రాంతాలపై కన్నేసి ఉంచారు. తనిఖీలు నిర్వహిస్తున్నారు. నిజానికి దేశ విభజన జరిగిన నాటినుంచే భారత్‌తో మూఖాముఖి తలపడే సత్త లేని పాకిస్తాన్‌ ఉగ్రదాడులు చేయించేందుకు కుట్రలు పన్నుతోంది. ఇండియాలో ప్రవేశించేందుకు ఉగ్రవాదులు అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే చాలా మంది చొరబడి ఉండొచ్చు. ఏ క్షణంలోనైనా వారు సరిహద్దులను దాటుకుని భారత గడ్డపై అడుగు పెట్టే అవకాశాలను కొట్టిపారేయలేం. దీంతో ఆర్మీ సరిహద్దు భద్రతను మరింత కట్టుదిట్టం చేసింది.